తెలుగు సినీ సంగీత ప్రపంచంలో రాజేశ్వరరావు శైలి ప్రత్యేకం


Sat,October 12, 2019 02:37 AM

తెలుగుయూనివర్సిటీ : తెలుగు సినీ సంగీత ప్రపంచంలో రాజేశ్వరరావు శైలి ప్రత్యేకమని తెలంగాణ ప్రభుత్వ న్యూఢిల్లీ అధికార ప్రతినిధి డాక్టర్ సముద్రాల వేణుగోపాలచారి అన్నారు. ప్రముఖ సంగీత దర్శకులు డాక్టర్ సాలూరి రాజేశ్వరరావు జయంతిని శుక్రవారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో రసమయి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ లలిత సంగీత గాయకులు, స్వరకర్త డాక్టర్ కొమండూరి రామాచారిని ప్రతిష్టాత్మకమైన సాలూరి ప్రతిభా పురస్కారంతో సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ వేణుగోపాలాచారి మాట్లాడుతూ విద్యతోపాటు సంగీతం, సాహిత్యం పట్ల పిల్లలకు శిక్షణను ఇప్పించాలన్నారు. ఏపీ మహిళా కమిషన్ పూర్వ చైర్మన్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ అర్థవంతమైన భాషతో కూడిన సందేశాత్మకమైన పాటలను సంగీతప్రియులకు అందించిన రాజేశ్వరరావు పాటలు చిరస్థాయిగా నిలుస్తాయన్నారు. ఏపీ పూర్వ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు, సాలూరి రాజేశ్వరరావు కుమారుడు సాలూరి పూర్ణచందర్‌రావు, రసమయి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎం.కె.రాము, వ్యాఖ్యాత ఆశాలత పాల్గొన్నారు. రాజేశ్వరరావు సంగీతం స్వరపరిచిన చలన చిత్రాల్లోని ఆణిముత్యాల్లాంటి గీతాలను లిటిల్ మ్యూజీషియన్స్ అకాడమీకి చెందిన గాయనీగాయకులు ఆలపించి సంగీత ప్రియులకు పంచారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...