ప్రజా రవాణాపై ప్రత్యేక దృష్టి


Sat,October 12, 2019 02:35 AM

కంటోన్మెంట్, నమస్తే తెలంగాణ : ప్రజా రవాణాను మెరుగు పర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని నగర ట్రాఫిక్ పోలీస్ అదనపు కమిషనర్ అనిల్‌కుమార్ అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ మెట్రో స్టేషన్ బౌన్స్ అనే సంస్థ ఏర్పాటు చేసిన అద్దె బైక్‌లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అనిల్‌కుమార్ మాట్లాడుతూ..గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెందిన నగరంలో ప్రతిరోజు మెట్రో రైలులో లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ప్రయాణికుల కోసం బౌన్స్ సంస్థ అద్దె బైకులను తీసుకురావడం అభినందనీయమని అన్నారు. తక్కువ చార్జీలకే అద్దె బైక్‌లను మెట్రో స్టేషన్లలో అందుబాటులోకి తెస్తున్న నేపథ్యంలో..ఈ సౌకర్యాన్ని సిటిజనులు వినియోగించుకోవాలని కోరారు. బౌన్స్ హైదరాబాద్ విభాగాధిపతి తేజస్వీ పవార్ మాట్లాడుతూ నగరంలోని తొలి విడుతలో సికింద్రాబాద్, హైటెక్ సిటీ, జూబ్లీ చెక్‌పోస్ట్, సిబీఎస్ తదితర ప్రాంతాల్లో అద్దె బైకులను అందుబాటులోకి తెచ్చిందన్నారు. బౌన్స్ సంస్థ అసిస్టెంట్ మేనేజర్లు రాజీవ్, కార్తీక్, ట్రాఫిక్ అదనపు డీసీపీ భాస్కర్, నార్త్ జోన్ ఏసీపీ వెంకటరమణ, బౌన్స్ గవర్నమెంట్ రిలేషన్స్ పాలసీ మేనేజర్ సంజయ్ భార్గవ్ గాంధారి పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...