నిర్మాణ వ్యర్థాలు.. భారీ జరిమానాలు


Thu,October 10, 2019 02:41 AM

-చందానగర్ సర్కిల్‌లో ఒకేరోజు రూ.6.62 లక్షలు వసూలు
చందానగర్: చందానగర్ సర్కిల్ కార్యాలయం పరిధిలో భవన నిర్మాణ వ్యర్థాలను రోడ్లపై వేసిన ఇంటి యజమానుల నుంచి అధికారులు భారీ మొత్తంలో జరిమానాలు వసూలు చేశారు. భవన నిర్మాణ వ్యర్థాలను రోడ్లపై వేసే వారిని లక్ష్యంగా చేసుకొని డివిజన్ల వారీగా ఒక ఎస్‌ఆర్‌పీ, ఒక చైన్‌మెన్‌కు జరిమానా వసూళ్ల బాధ్యతలు అప్పగించారు. కాగా మాదాపూర్ డివిజన్ నుంచి రూ.3.42 లక్షలు, మియాపూర్ డివిజన్ నుంచి రూ.1 లక్ష, హఫీజ్‌పేట్ డివిజన్ నుంచి రూ.70 వేలు, చందానగర్ డివిజన్ నుంచి రూ.1.50 లక్షల చొప్పున మొత్తం రూ.6.62 లక్షలు వసూలు చేశారు. మాతృశ్రీనగర్ రోడ్లపై భవన నిర్మాణ వ్యర్థాలు వేసినందుకు ప్లాట్ నంబర్ 65,66 యజమాని కోటేశ్వర్‌రావు, ప్లాట్ నంబర్ 135 యజమాని నుంచి అత్యధికంగా రూ.1 లక్ష చొప్పున జరిమానా వేశారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...