ఆలోచింపజేసిన డిజైన్ నైట్...


Thu,October 10, 2019 02:39 AM

సిటీబ్యూరో,నమస్తే తెలంగాణ:ఇండియన్ స్టార్టప్ సోషల్ హార్డ్‌వేర్ సంస్థ బుధవారం నగరంలో నిర్వహించిన డిజైన్ నైట్ ఆలోచింపజేసింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు10లో ఏర్పాటు చేసిన ఒక్కరోజు కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ఆటోడెస్క్ సంయుక్తంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్‌లో నిర్వహించింది. అమెరికా , దుబాయ్ వంటి ప్రముఖ దేశాల్లో నిర్వహించే ఇటువంటి ఈవెంట్‌లు కృత్రిమ మేధస్సును ప్రోత్సహిస్తాయి. ఇందులోభాగంగా సరికొత్తగా డిజైన్ అండ్ టెక్నాలజీతో కూడిన ఆవిష్కరణలకు వీటిలో పెద్దపీట వేస్తారు. ముఖ్యంగా అగ్రికల్చర్, కన్‌స్ట్రక్షన్ వర్క్, మెకానికల్ వంటి పనుల్లో జరుగుతున్న ప్రమాదాల వల్ల జరిగే గాయాల్లో జీవితాలు నష్టపోకుండా ప్రత్యామ్నాయ అవయవాల అమరిక వంటి వాటిపై డిజైన్ నైట్ నిర్వహించారు. ప్రమాదం జరిగినప్పుడు అవయవాలు కోల్పోతే అంతే సామర్థ్యం ఉన్న వాటిని కృత్రిమ మేధస్సుతో తయారు చేసి జీవన ప్రమాణాలు తగ్గకుండా చూడడం వీటి ఉద్దేశం.ఇందుకోసం కృత్రిమ అవయవం బరువు కూడా తగ్గించే ప్రక్రియకు దోహదం చేయడం వంటి వాటిని చేపడుతారు. వీటితోపాటు వాహనాల విడి భాగాలు, ఇతర వాటికి కొత్త డిజైన్‌లను అందుబాటులోకి తెస్తారు. వెహికల్స్,సీటుబెల్టులు ఇతర కృత్రిమ పరికరాలను ప్రదర్శనలో ఉంచారు. ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వ్యవసాయదారులకు ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఇటువంటి ప్రదర్శనలు శాన్‌ఫ్రాన్సిస్కో, బోస్టన్, డబ్లిన్, దుబాయ్, సింగపూర్ వంటి ప్రాంతాల్లో నిర్వహిస్తుంటారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...