హెచ్‌సీయూని సందర్శించిన న్యూజెర్సీ మేయర్


Fri,September 20, 2019 01:49 AM

కొండాపూర్ : గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని లైఫ్ సైన్స్ ఇంక్యూబెటర్ సెంటర్‌ను గురువారం అమెరికాలోని న్యూ జెర్సీ మేయర్ టమ్మీ సిండర్ ముర్ఫీ ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ ప్రతినిధులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా యూఎస్ ప్రతినిధులు లైఫ్ సెన్స్ విభాగం అధ్యాపకులు, విద్యార్థులతో స్టార్టప్ సంస్థల ఏర్పాటు, నూతన టెక్నాలజీల అభివృద్ధి, పరిశోధనలపై చర్చించినట్లు వర్సిటీ పీఆర్‌ఓ ఆశీష్ జెకాబ్ తెలిపారు. వర్సిటీ వీసీ పి.అప్పారావు, ఆస్పైర్ -బయోనెస్ట్ ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ రెడ్డన్న, టై-యూ డైరెక్టర్ జీఎస్ ప్రసాద్‌లు అమెరికా ప్రతినిధులతో వర్సిటీల మధ్య నెలకొల్పుతున్న సంబంధాల గురించి ప్రత్యేకంగా చర్చించినట్లు పేర్కొన్నారు. హెచ్‌సీయూ, ప్రిన్స్‌టన్ యూనివర్సిటీల కలయికతో సరికొత్త ఆవిష్కరణలు తీసుకువచ్చేలా సంబంధాలను కొనసాగించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...