మ్యాట్రిమోనీ మోసాలకు చెక్ పెట్టండి..!


Thu,September 19, 2019 03:20 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లను వేదికగా చేసుకొని ఆఫ్రికన్ దేశాలకు చెందిన సైబర్‌నేరగాళ్లు, పెండ్లి సంబంధాల కోసం ప్రయత్నించే వారిని బుట్టలో వేసుకొని మోసం చేస్తున్నారని, వెబ్‌సైట్ నిర్వాహకులు ఈ విషయంలో తగినచర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సూచించారు. వివిధ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ నిర్వాహకులతో సీపీ బుధవారం సమావేశాన్ని నిర్వహించారు. పెండ్లి సంబంధాల కోసం వివిధ వెబ్‌సైట్లలో తమ ప్రొఫైల్‌ను అప్‌లోడ్ చేసే మహిళలు, పురుషులకు తాము పెండ్లి చేసుకోవడానికి సిద్ధ్దమే అంటూ పరిచయాలు పెంచుకుంటూ, ఆ తర్వాత బహుమతులు పం పిస్తున్నామని చెప్పి అమాయకుల నుంచి డబ్బు లాగేస్తున్న ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయని సీపీ అన్నారు.

కొందరు ఇండియాలో ఉండడం, మరికొందరు ఇతర దేశాల్లో ఉంటూ తాము ఇంగ్లాండ్, యూర ప్, యూఎస్‌ఏలో పనిచేస్తున్నామంటూ ఎక్కువగా పెండ్లి సంబంధాల కోసం ప్రయత్నించే ఒంటరి మహిళలు, ఒంటరి పురుషులకు(వితంతువులు, విడాకులు తీసుకున్నవారు) డాలర్లు, బంగారం పంపిస్తున్నామం టూ నమ్మించి, ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారంటూ మోసం చేస్తున్నారని సీపీ వివరించారు. మ్యాట్రిమోనీ వెబ్‌సైట నిర్వాహకులు ఇలాంటి మోసాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, నిందితులను గుర్తించడం, అమాయకులు వారి చేతిలో పడకుండా ఉండే విధంగా తమ వెబ్‌సైట్లలో ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. మోసం జరిగిన తర్వాత బాధపడడం కంటే, ఆ మోసం జరగకుండా చేసుకోవాలన్నారు. ఇందులో భారత్ మ్యాట్రీమోని, షాదీ.కామ్ తదితర వెబ్‌సైట్ నిర్వాహకులు పాల్గొన్నారు. సమావేశంలో సైబరాబాద్‌తోపాటు రాచకొండ పోలీస్ కమిషనరేట్ల డీసీపీలు, సైబర్‌క్రైమ్ పోలీసులు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...