పల్లె ప్రగతి పనులు వేగవంతం చేయాలి


Thu,September 19, 2019 03:18 AM

రంగారెడ్డి జిల్లా, నమస్తే తెలంగాణ: పంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక 30రోజుల అమలులో భాగంగా పనుల్లో వేగం పెంచాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ హరీశ్ జిల్లా నోడల్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశం మందిరంలో 30రోజుల పంచాయతీ ప్రణాళిక కార్యాచరణ పనులపురోగతిపై జిల్లా నోడ ల్ అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రణాళిక గడువుకాలం సగం ముగిసిందని, పనులను యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేయాలన్నారు. గ్రామంలో ఊరి(ఎంట్రీ)మొదట, గ్రా మం చివర(ఎక్సిట్) పరిశుభ్రంగా ఉండాలన్నారు. పల్లెలు పచ్చగా కళకళలాడేలా గ్రామాల్లో మొక్కలను నాటాలన్నా రు. ప్రజల్లో విసృత్త భాగస్వామ్యాన్ని పెంపొందించాలని సూచించారు. కూలిపోయిన ఇండ్లు, పాడుబడిన పశువుల కొట్టాల శిథిలాలు తొలగించాలన్నారు. సర్కార్ తుమ్మ, జిల్లేడు లాంటి చెట్లను తొలగించి పాడుపడిన బావులు, నిరుపయోగంగా ఉన్న బోరు బావులను, లోతట్టు ప్రాం తాల్లోని నీటి గుంతలను పూడ్చివేయాలన్నారు. ప్రతీ ఇం టికి మురుగుదొడ్డి నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. దోమల మందు పిచికారీ చేయాలని వివరించా రు.డ్రైనేజీ శుభ్రం చేసి మురికి కాలువల్లో చెత్తచెదారం తొలగించాలని పేర్కొన్నారు. రోడ్లపై గుంతలను పూడ్చివేయాలన్నారు.

ప్రతి ఇంట్లో చెత్త బుట్ట ఉండేలా ప్రజలను ప్రోత్సహించాలని, చెత్తను ఎత్తి, డంపింగ్ యార్డులో వేసి, ఆ చెత్తను కంపోస్టు ఎరువుగా వినియోగించేలా బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రజల్లో చైతన్యం కలిగించి, గ్రామాలను అద్దంలా తీర్చిదిద్దాలన్నారు. దాతల సహకారంతో దహన వాటికలు (వైకుంఠ ధామం, డంపింగ్ యార్డులకు స్థలం ఎంపిక చేసి ఏర్పాటు చేసుకోవాలన్నారు. గ్రామం లో అసవరమైన మొక్కలను సిద్ధం చేయడానికి గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నర్సరీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శాశ్వత ప్రాతిపదికన నర్సరీలు నిర్వహించడానికి అనువైన స్థలం ఎంపిక చేసి నర్సరీలను పెంచడానికి ఫారెస్ట్ రేంజ్ అధికారి గ్రామ పంచాయతీలకు సాంకేతిక సహకారం అందించాలన్నారు. తప్పుపట్టిన స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలను ఏర్పాటు చేసి ఎల్‌ఈడీ లైట్ల ను అమర్చాలన్నారు. వీధి దీపాల సమర్థ నిర్వహణకు సమయపాలన పాటించాలన్నారు. పనుల వేగం పెంచి గ్రామాలను అందంగా తీర్చిదిద్దాలని జిల్లా నోడల్ అధికారులను ఆదేశించారు. ప్రత్యేక ప్రణాళిక అమలు అనంతరం సీనియర్ అధికారుల నేతృత్వంలో 100 ప్లయింగ్ స్కాడ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. ఒక్కోబృందం ఐదు గ్రామాలను పర్యటిస్తారన్నారు.లక్ష్యాలను సాధించిన గ్రామాలకు ప్రోత్సహకాలు అందుతాయని, అజాగ్రత్త, అలసత్వం ప్రదర్శించిన వారిపై క్రమ శిక్షణ చర్యలుంటాయని కలెక్టర్ హరీశ్ స్పష్టం చేశారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...