సామాజిక బాధ్యతగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నాం


Thu,September 19, 2019 03:17 AM

చర్లపల్లి: సామాజిక బాధ్యతగా కుషాయిగూడ ప్రభుత్వ పాఠశాలలో లక్షలాదినిధులతో సౌకర్యాలు కల్పిస్తున్నామని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఇం డియా లిమిటెడ్(ఈసీఐఎల్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫైనాన్స్ స్వర్ణశంకరన్ పేర్కొన్నారు. ఏఎస్‌రావునగర్ డివిజన్ పరిధిలోని కుషాయిగూడ ప్రభుత్వ పాఠశాలలో ఈసీఐఎల్ సీఎస్‌ఆర్‌లో భాగంగా రూ.13 లక్షల 40 వేలతో నూతనంగా నిర్మించిన వంటశాల, డైనింగ్ హాల్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎస్‌ఆర్ కార్యక్రమంలో భాగంగా ప్రభు త్వ పాఠశాలలో సౌకర్యాలు కల్పింస్తున్నామని, గతంలో అదనంగా గదుల నిర్మాణం, మూత్రశాలల నిర్మాణం, ఆర్‌ఓ వాటర్‌ప్లాంట్, విద్యార్థుల కోసం బెంచీలు, కంప్యూటర్ పరిజ్ఞానం కోసం ల్యాబ్‌తోపాటు కంప్యూటర్లను అందజేశామని గుర్తు చేశారు.

ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంతోపాటు వారికి ఆయా రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. మేడ్చల్ జిల్లా పరిధిలోని ఎంపిక చేసుకున్న ప్రభుత్వ పాఠశాలలో లక్షలాది నిధులు కేటాయించి సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా విద్యార్థులకు వృత్తి, ఉపాధి అవకాశాల కోర్సులను ఇప్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అనంతరం విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఈసీఐఎల్ హెడ్ పీఆండ్‌ఏ అసీఫ్‌ల్లాబేగ్, పీఏ సీఎస్‌ఆర్ సునీల్‌కుమార్, పరిశ్రమ యూనియన్ అధ్య క్ష, కార్యదర్శులు సీహెచ్.భాస్కర్‌రెడ్డి, నారా నర్సింహ, ఈసీఓఏ అధ్యక్ష, కార్యదర్శులు కమలకాంత్, వెంకన్నలతోపాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...