ఫీజు డబ్బులు ఇస్తే.. గోవాకు వెళ్లాడు


Wed,September 18, 2019 02:50 AM

హిమాయత్‌నగర్ : ట్యూషన్ ఫీజు కట్టమని డబ్బులు ఇస్తే.. ఓ బాలుడు జల్సా చేసేందుకు గోవాకు వెళ్లాడు. ఈ సంఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన బ్రిజేష్ కుటుంబం నారాయణగూడలో నివాసం ఉంటుంది. అతని కుమారుడు (16) స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నాడు. కాగా.. ఈ నెల 5న కుటుంబ సమేతంగా స్వరాష్ర్టానికి వెళ్లి .. తిరిగి ఈ నెల 11న నగరానికి వచ్చారు. ఆ సందర్భంలో నిమజ్జనాన్ని చూసేందుకు వెళ్తానని బాలుడు చెప్పగా.. అందుకు తల్లిదండ్రులు నిరాకరించారు. చక్కగా చదువుకోవాలని, ట్యూషన్ ఫీజు చెల్లించమని రూ.10వేలు చేతికిచ్చా రు. అదే రోజు అర్ధరాత్రి యాక్టివా తీసుకొని బయలుదేరాడు. మరుసటి రోజు ఉదయం తల్లిదండ్రులు చూడగా కొడుకు కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి.. సెల్ ఫోన్ సిగ్నల్ ట్రాక్ చేయగా, మహబూబ్‌నగర్ మీదుగా గోవా హైవే మీదుగా వెళ్లినట్లు గుర్తించారు. 12న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 5గంటల వరకు సిగ్నల్ ట్రాక్ చేయగా, కర్ణాటక రాష్ట్రం, బెల్గాం సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. అలా ఐదు రోజుల పాటు తిరుగుతూనే ఉన్నాడు. అనంతరం గోవాలోని అంజనా బీచ్‌కు చేరుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న బాలుడి తండ్రి ఫోన్ చేయగా.. పప్పా నేను గోవాలో ఉన్నా.... రెండు రోజుల్లో హైదరాబాద్‌కు వచ్చేస్తానంటూ సెలవిచ్చాడు. తాను కూడా అక్కడే ఉన్నట్లు చెప్పడంతో ఇద్దరు బీచ్ వద్ద కలుసుకున్నారు. దీంతో కథ సుఖాంతమైంది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...