రూపాయి నల్లా కనెక్షన్ మరింత సులభతరం


Wed,September 18, 2019 02:49 AM

-ఇక జీఎం స్థాయిలోనే అనుమతులు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : దారిద్య్ర రేఖకు దిగువన గల తెల్లరేషన్ కార్డు కుటుంబాలు రూపాయి నల్లా కనెక్షన్లు పొందే ప్రక్రియను జలమండలి అధికారులు మరింత సులభతరం చేశారు. పేదలకు నల్లాల ద్వారా సమృద్ధిగా నీరందించే ప్రక్రియలో భాగంగా గడిచిన మూడేండ్లుగా నిరుపేదలు, మధ్యతరగతి వేతన జీవులకు రూపాయికే నల్లా కనెక్షన్ మంజూరు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కనెక్షన్ కోసం కావాల్సిన పైపులతోపాటు రోడ్ల తవ్వకాల వ్యయాన్ని సైతం జలమండలియే భరించేలా నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 37వేల మందికి రూపాయికే నల్లా కనెక్షన్ అనుమతులు ఇచ్చారు. ఇప్పటి వరకు ఈ కనెక్షన్ అనుమతి ఖైరతాబాద్ సంస్థ ప్రధాన కార్యాలయంలోని సింగిల్ విండో విభాగం ద్వారా అనుమతి పొందిన తర్వాత నల్లా కనెక్షన్ ఇచ్చేవారు. కానీ ఇక నుంచి క్షేత్రస్థాయిలోని జనరల్ మేనేజర్(జీఎం)స్థాయిలోనే రూపాయికే నల్లా కనెక్షన్ అనుమతులు ఇవ్వనున్నారు. తద్వారా 15 రోజులు పట్టే సమయం కేవలం రెండు మూడు రోజుల్లోనే అనుమతులు దక్కనున్నాయి.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...