ముగిసిన డ్రెస్ కోడ్ వివాదం


Wed,September 18, 2019 02:48 AM

అమీర్‌పేట్, నమస్తే తెలంగాణ : ఎడ్యుకేట్.. నాట్ రెగ్యులేట్.. అంటూ సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాల విధించిన డ్రెస్ కోడ్‌పై విద్యార్థినుల ఆందోళనకు సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థినులు కుర్తీలు ధరించి రావాలంటూ.. అది కూడా నిర్దిష్టమైన సైజులను నిర్దేశిస్తూ కళాశాల విధించిన కోడ్ పట్ల విద్యార్థినులు సోమవారం కళాశాల గేటు ఎదుట తమ నిరసన ధ్వనిని వినిపించిన తీరు తల్లిదండ్రుల నుంచి ప్రముఖుల వరకు ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సైతం విద్యార్థినుల తెగువను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. సమస్యను పరిష్కరించుకోవడంలో వారి తెగువ సమాజంలో ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుందని, ప్రాథమిక హక్కులను సాధించుకునే క్రమంలో వారు తమ వాణీని వినిపించిన తీరు ప్రశంసనీయమని ట్వీట్‌లో పేర్కొన్నారు. విద్యార్థినులు పొడవైన కుర్తీలు ధరించి రావాలని, ప్రాథమిక హక్కులను సాధించుకునే విషయంలో విద్యార్థినులను గేటు వద్దే నిలిపి తాము నియమించిన సిబ్బంది చేత వారి దుస్తుల కొలతలను చెక్ చేయించడం వారిని అసహనానికి గురి చేసింది. కొన్ని సందర్భాల్లో అయితే ఏకంగా తరగతి గదుల్లో కూడా ఈ విషయమై యాజమాన్య ప్రతినిధులకు సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయంటూ విద్యార్థినులు ఎంతగా ఇబ్బందిపడ్డారో తెలుస్తుందంటూ హెచ్‌ఆర్‌సీలో పిటిషన్ దాఖలు చేసే వరకు వెళ్లింది. అయితే డ్రెస్ కోడ్ విషయంలో విద్యార్థి ప్రతినిధులతో యాజమాన్యం రెండు గంటల పాటు చర్చించి ఎట్టకేలకు ఈ నిబంధనను ఉపసంహరించిన విషయాన్ని మైక్‌లో ప్రకటించే వరకు ఈ కళాశాల ఎదుట విద్యార్థినులు వెనుకడుగు వేయకుండా పోరాట స్ఫూర్తితో నిలువడం పట్ల అన్నివర్గాల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...