మట్టిలో మాణిక్యాలు..


Tue,September 17, 2019 02:24 AM

-వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధి, ఉద్యోగావకాశాలు
-సద్వినియోగం చేసుకొని పలు రంగాల్లో రాణిస్తున్న యువత
రెడ్డి రాజనరేందర్ (శంషాబాద్):వారంతా ఒకప్పుడు కూలీలు.. ఇపుడు ఇరాక్, దుబాయ్‌లలో స్వశక్తి, స్వయం ఉపాధితో రాణిస్తున్నారు. చదువు సంధ్యలు పెద్దగా లేవు.. ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగాలు రాక పోయినా, చాలీచాలని చదువులతో ఉన్నత స్థానాలకు చేరకపోయినా నిరుత్సాహ పడకుండా స్శశక్తి, స్వయం ఉపాధితో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తల్లిదండ్రులు మందలించారని, పరీక్షల్లో తప్పి మనస్తాపం చెంది ఆత్మహత్మలకు పాల్పడే వారికి వీరి జీవితాలు ఆదర్శం. కష్టాలను ఎదిరించి సవాళ్లకు ప్రతిసవాళ్లుగా దుబాయ్‌లో ఏసీ టెక్నిషియన్ విజయవర్మ, బ్యుటిషియన్‌గా సంధ్య, ఇరాక్‌లో ఎగ్జావేటర్ ఆపరేటర్‌గా రూ. 80 వేల జీతం పొందుతున్న వెంకటేశ్ విజయాలు సాధించి పలువరి మన్ననలు పొందుతున్న వీరు నేటి యువతకు స్ఫూరిగా నిలస్తున్నారు. ఆకలితో ఉన్న వాడికి చేపల కూర, చేపల పులుసు పెట్టడం కన్నా.. చేపలు ఎలా పట్టాలో నేర్పడం మంచిది అనేది చైనా సామెత. ఆ అక్షర సత్యాలను నిజం చేస్తున్నది హైదరాబాద్ శంషాబాద్ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్వహణ భాగస్వామ్య సంస్థ శ్రీ వరలక్ష్మి ఫౌండేషన్(సీఎస్‌ఆర్). 2007లో ప్రారంభమైన సంస్థ దశాబ్ద కాలంగా సుమారు 11, 000 మంది యువతీయువకులకు ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగఉపాధి అవకాశాలు కల్పించింది. ప్రతి ఏటా దాదాపు 1000 మంది ఉచిత శిక్షణ పొందుతున్నారు. అలా శిక్షణ పొందిన వారిలో కొందరు స్వయంగా ఉపాధి పొందుతున్నారు. మరి కొందరు ప్రముఖ కంపనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. కొద్దిపాటి శిక్షణ తీసుకుంటే చాలు.. హైదరాబాద్‌లోని వివిధ షాపింగ్ మాళ్లు, కంపనీలు, ఐటీ సంస్థల్లో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. 12 కోర్సులలో శిక్షణ ఇచ్చి ఉపాధి చూపిస్తుండటం పేద యువతకు ఉపయుక్తంగా ఉన్నది.

ఎయిర్‌పోర్టు పరిసరాలతో పాటు పలువురికి..
సీఎస్‌ఆర్ కాంట్రాక్టు ప్రాజెక్టు ఎయిర్‌పోర్టు పరిసరాల్లోని గ్రామాలతో పాటు ఇతర ప్రాంతాల్లో సామాజిక అభివృద్ధి, సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నది. అదే విధంగా రెండు తెలుగు రాష్ర్టాల యువతకు కూడ ఇక్కడ శిక్షణ, ఉపాధి కల్పిస్తున్నారు.

స్వచ్ఛందంగా.. అంతా ఉచితమే
శిక్షణ పూర్తి ఉచితం. వసతి, భోజన సౌకర్యమే కాకుండా ఏకరూప దుస్తులు, కోర్సుకు సంబంధించి పుస్తకాలు, పరికరాలు అందజేస్తారు. మూడు నెలల పాటు శిక్షణ తీసుకోవాలి. తర్వాత సంస్థ ప్రతినిధులే వీరికి ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటారు. ఉద్యోగులు కావాల్సిన సంస్థల జాబితా నిర్వాహకుల దగ్గర ఉంటుంది. వీరు ఆయా జాబితాలోని సంస్థలను సంప్రదించి తమ వద్ద శిక్షణ పొందిన వారి వివరాలు ఇచ్చి ఉద్యోగం ఇప్పించేందుకు సహకరిస్తారు.

కేంద్రం సహాయంతో....
కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన కింద యువతకు నైపుణ్య అభివృద్ధ్దిలో శిక్షణ ఇచ్చే కార్యక్రమం చేపట్టింది. గత నెలలో ఫౌండేషన్‌లో ప్రారంభించారు. వివిధ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. ఒక యువకుడు ఏడు, పదో తరగతి చదివితే ఉపాధి పొందడం కష్టం. అదే యువకుడికి ప్లంబరింగ్‌లోనో.. ఎలక్ట్రిషియన్‌గానో శిక్షణ ఇస్తే.. ఏదో ఒక పరిశ్రమలో ఉపాధి పొందేందుకు వీలుంటుంది. కనీసం సొంత కాళ్లపై నిలబడేందుకైనా అవకాశం ఏర్పడుతుంది. తాను ఉండే ప్రాంతంలోనే శిక్షణ తీసుకున్న వృత్తికి సంబంధించి పనులు చేస్తూ ఉపాధి పొందవచ్చు. అదే విధంగా శంషాబాద్ మండలం ముచ్చింతల్ పరిధిలోని స్వర్ణభారతి ట్రస్టు భాగస్వామ్యంతో పలువురు నిరుద్యోగ యువతకు ఆయా వృత్తి కోర్సులలో ఉచితంగా శిక్షణ, ఉపాధి, ఉద్యోగావకాశాలు ఇప్పిస్తున్నారు.

నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, ఉపాధి..
వరలక్ష్మి ఫౌండేషన్ ఉచిత శిక్షణ కేంద్రంలో పదేండ్లుగా సుమారు 11000 మంది ఉచితంగా పలు వృత్తి కోర్సులలో శిక్షణతో పాటు ఉపాధి, ఉద్యోగాలు పొందారు. వివిధ వృత్తి కోర్సుల్లో శిక్షణ ఇచ్చి అధికారికంగా యోగ్యతా పత్రాలను అందజేస్తున్నారు. అదే విధంగా వివిధ చోట్ల ఉద్యోగావకాశాలను కల్పించి ఉపాధి చూపుతున్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...