ఓఆర్‌ఆర్ లోపల జలమండలి డివిజన్లు ఏర్పాటు


Tue,September 17, 2019 02:20 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఔటర్ రింగు రోడ్డు లోపల 190 గ్రామాల్లో నీటి సరఫరాను మరింత మెరుగుపర్చడమే లక్ష్యంగా జలమండలి చర్యలు చేపడుతున్నది. ప్రజలకు మెరుగైన సేవలకుగానూ ఇప్పటికే తాగునీటి ప్రాజెక్టును చేపట్టిన అధికారులు ప్రత్యేకంగా మూడు డివిజన్లను స్థానికంగా ఏర్పాటు చేస్తూ జలమండలి ఎండీ దానకిశోర్ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. ఎంసీహెచ్ పరిధి 169.30 స్కేర్ కిలోమీటర్ల పరిధిని సేవల పరిధిలో ఓఆర్‌ఆర్ వరకు 1628 కిలోమీటర్ల మేర పెంచుకున్నది. ఇందు లో భాగంగానే ఓఆర్‌ఆర్ లోపల 11 మండలాల పరి ధి ప్రజలకు సమృద్ధ్దిగా నీటి సరఫరాకుగానూ పట్టణ భగీరథ పథకంలో భాగంగా రూ.756కోట్లతో తాగునీటి పథకాన్ని చేపట్టారు. 1350కిలోమీటర్ల మేర డిస్ట్రిబ్యూషన్ పైపులైన్, 337కిలోమీటర్ల మేర ఫీడర్ మెయిన్స్ పైపులైన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 70 మిలియన్ లీటర్ల సామర్థ్యం మేర నీటితో 10లక్షల జనాభాకు మెరుగైన నీటి సరఫరా లక్ష్యంగా 164 రిజర్వాయర్లు నిర్మించారు. గడిచిన కొన్నినెలలుగా 1.50 లక్షల మందికి కొత్తగా నల్లా కనెక్షన్లు మంజూరు చేశా రు. అంతేకాకుండా దారిద్య్రరేఖకు దిగువనున్న 1000మందికి రూపాయికే నల్లా ఇచ్చారు. నల్లా కనెక్షన్ల కోసం దరఖాస్తులు అత్యధికస్థాయిలో వస్తుండడంతో ప్రస్తుతం ఉన్న డివిజన్లపై పనిభారం పెరగడమే కాకుండా దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాజేంద్రనగర్, ఘట్‌కేసర్, సరూర్‌నగర్ మండలాల పరిధిలో నూతనంగా డివిజన్లను ఏర్పాటు చేస్తూ ఎండీ దానకిశోర్ నిర్ణయం తీసుకున్నారు. జలమండలికి సంబంధించిన సేవలన్నీ స్థానికంగా అందించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సంస్థ పరిధిలో ప్రస్తుతం 17 నిర్వహణ (ఓఅండ్‌ఎం) డివిజన్లు ఉండగా, ట్రాన్స్‌మిషన్, గోదావరి, కృష్ణా జలాల తరలింపు ప్రక్రియ కోసం ప్రత్యేక డివిజన్లు ఉన్నాయి. కొత్తగా డివిజన్ 18, 19, 20లను అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటితోపాటు త్వరలో 586.86 కోట్లతో ఓఆర్‌ఆర్ ఫేజ్-2 తాగునీటి పథకం చేపట్టేందుకు మా ర్గం సుగమమంకావడంతో ముందస్తుగా ప్రాజెక్టు డివిజన్లను ఏర్పాటు చేశారు. తాగు, మురుగునీటి ప్రాజెక్టులు చేపట్టేందుకు వీలుగా ఈప్రాజెక్టు డివిజన్లు దోహదపడనున్నాయి. కొత్త డివిజన్ల ఏర్పాటుతో ప్రజలకు సంస్థ సేవలు మరింత సులభతరం కానున్నాయి.

93
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...