సరోజిని దేవి దవాఖానలో.. సౌకర్యాల కల్పనకు కృషి


Tue,September 17, 2019 02:19 AM

మెహిదీపట్నం సెప్టెంబర్ 16 : ప్రజలకు మెరుగైన కంటి వైద్యం అందించడానికి మెహిదీపట్నం సరోజినిదేవి కంటి దవాఖానలో సౌకర్యాలను కల్పించడానికి కృషి చేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడి జన్మదినం , వంద రోజుల పాలనను పురస్కరించుకొని సప్తాహ సేవా కార్యక్రమంలో భాగంగా సోమవారం మెహిదీపట్నం సరోజినిదేవి కంటి దవాఖానను సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం, ఆర్‌ఎంఓ నజాఫీ బేగం, సిబ్బంది శాలువాతో సన్మానించి మొక్కను బహూకరించారు. ఈ సందర్భంగా దవాఖానలో రోగులకు నాణ్యమైన వైద్యం అందించడానికి డాక్టర్లు కృషి చేయాలని మంత్రి సూచించారు. అయితే దవాఖానలో ఆపరేషన్ థియేటర్లలో యంత్రాలు, ఓపీలో పరీక్షల యంత్రాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి రోగులను తీసుకువచ్చి పరీక్షలు నిర్వహించడానికి వాహనం కావాలని కోరుతూ సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం వినతిపత్రం అందచేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండే పథకాలతో దవాఖాన అభివృద్ధికి కృషి చేస్తానని, రాష్ట్రంలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో కూడా మాట్లాడుతానని తెలిపారు. అనంతరం ఆసిఫ్‌నగర్ గాంధీ చౌరస్తాలో పర్యటించి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడ పేరుకుపోయిన మట్టిని, తరలించి రోడ్లను ఊడ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కరుణాకర్, భుజేందర్, కాంతికిరణ్, రమేశ్, అంబేద్కర్, ముఖేశ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...