చలానాకు బదులుగా హెల్మెట్.. ఇన్సూరెన్స్


Sun,September 15, 2019 03:54 AM

- ట్రాఫిక్ పోలీసులపై వ్యతిరేకతను తొలగించేందుకే ...
-ట్రాఫిక్ డీసీపీ దివ్యచరణ్‌రావు

ఉప్పల్ /సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ట్రాఫిక్ చలాన్లు పెరిగాయి.. పోలీసోళ్లకు పండుగనే.. ఇక ఏముందిరాబై ట్రాఫిక్ పోలీసులకు పైసలే.. పైసలు..ట్రాఫిక్‌ను క్రమబద్ధించరుగానీ చలాన్ల కోసం రెడీగా ఉంటారు. ప్రతి చోట ఈ మాటలు ఇటీవల సవరణ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రతి వాహనదారుడు, సామాన్యుడు ట్రాఫిక్ పోలీసులు కనపడినప్పుడుల్లా వ్యగ్యంగా అంటున్న మాటలు ఇవి. వాహనదారులు, ప్రజల్లో పెరిగిన ఈ వ్యతిరేకతను రూపుమాపేందుకు డీజీపీ మహేందర్ రెడ్డి, రాచకొండ పోలీసు కమిషనర్, డీసీపీ దివ్యచరణ్ రావు సుదీర్ఘంగా ఆలోచించి చేసిన ఓ వినూత్న ప్రయత్నం ఇప్పుడు రాష్ట్రానికి ఆదర్శమైంది. రాచకొండ ట్రాఫిక్ పోలీసు చేసిన ఈ ప్రయత్నాన్ని అటు వాహనదారులు, సామన్య ప్రజలను ప్రశంసలను అందుకుంటుంది. ఈ వినూత్న కార్యక్రమం శనివారం రాచకొండ పోలీసు కమిషనరేట్‌లోని 8 ట్రాఫిక్ పోలీసు స్టేషన్లలో ప్రారంభమైంది. సవరణ వాహనదారులకు భారం కాకుండా వారికి మంచి మాటతో ఆ చలాన్ డబ్బులతో వారు ఉల్లంఘిస్తున్న సామగ్రిని ఇప్పించే కార్యక్రమాన్ని చేపట్టారు.

వినూత్న కార్యక్రమం ఇలా..
ఉప్పల్ వద్ద ట్రాఫిక్ పోలీసులు నిలపడ్డారు. ఓ వాహనదారుడు హెల్మెట్ లేకుండా వస్తున్నాడు. అతడిని ఆపారు. ట్రాఫిక్ నిబంధనలు సవరించిన దాని ప్రకా రం వెయ్యిరుపాయాల కట్టాలి. కానీ మేము నీకు చలాన్ వేస్త లేం. ఆ వెయ్యి రూపాయాలతో ఐఎస్‌ఐ ట్రేడ్ మార్క్‌తో హెల్మెట్ కోనుగోలు చేసుకో అంటూ సమయం ఇచ్చారు. అతను హెల్మెట్ కోనుకుని వచ్చాడు. ఇలా చలాన్ వేయకుండా వాహనదారుడికి అవకాశం ఇవ్వడంతో అతను హెల్మెట్ ధరించాడు. ఇక మీద అతనికి హెల్మెట్ ధరించడం అలవాటైపోతుంది.

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా..
మరో వాహనదారుడు హెల్మెట్ ఉన్నా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపించుకుంటూ వస్తున్నాడు. పత్రాలు చూపించమని అడిగినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ లేదు. సవరించిన జరిమానాల ప్రకారం రూ. 5 వేలు ఉంటుంది. కావును మీకు చలాన్ వేయడము లేదు. మీరు ఆన్‌లైన్ డ్రైవింగ్ లైసన్స్ స్లాట్ బుక్ చేసుకోండంటూ పోలీసు దగ్గర ఉండి అతనికి లెర్నింగ్ లైసన్స్ కోసం స్లాట్ కోసం బుక్ చేయించారు.

ఇన్సూరెన్స్
మరో వాహనదారుడికి డ్రైవింగ్ లైసెన్స్ ఉంది.. హెల్మెట్ ఉంది. కాని ఇన్సూరెన్స్ లేదు. సవరించిన ట్రాఫిక్ జరిమానా కింద ఇన్సూరెన్స్ లేకుంటే 2 వేల జరిమానా ఉంది. మేము జరిమానా వేయం.. ఇన్సూరెన్స్ తీసుకోండంటూ వాహనదారుడికి ఇన్సూరెన్స్ ఏజెంట్‌లను అందుబాటులో పెట్టారు. ఇలా అతను ఇన్సూరెన్స్ తీసుకుని ఏడాది వరకు ఇన్సూరెన్స్ మీద చలాన్ లేకుండా సాఫీగా ప్రయాణించ వచ్చని పోలీసులు వివరించారు.ఈ విధంగా రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని 8 ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌ల పరిధిలో 60 మంది హెల్మెట్‌లు కొన్నారు. 20 మంది డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ బుక్ చేసుకున్నారు. 20 మంది ఇన్సూరెన్స్ ను తీసుకున్నారు. మరో 20 మంది కాలుష్యం ఫ్రీ సర్టిఫికెట్‌లను పొందారు. ఈ ప్రయత్నం వాహనదారుల భద్రతకే కాని వారిని బలవంతం చేయడం కాదని అధికారులు స్పష్టం చేశారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...