ఆటలతో గణిత పాఠాలు


Sun,September 15, 2019 03:46 AM

చందానగర్, నమస్తే తెలంగాణ : చిన్నారులు ఆడుతూ పాడుతూ గణిత అంశాలను నేర్చుకున్నారు. చందానగర్‌లోని ఇన్‌సిగ్నిస్ ట్రాన్స్‌నేషనల్ స్కూల్‌లో శనివారం మ్యాథ్స్ ఎఫర్‌వెసెన్స్ ఫెస్ట్ నిర్వహించారు. ఈ ఫెస్ట్‌లో నర్సరీ నుంచి 5వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. చిన్నారులకు అర్థమయ్యే రీతిలో గణిత అంశాలను ఆకట్టుకునేలా బొమ్మలు, ఆటలు, ఇతర ఆకర్షణీయ పద్ధతులను బోధన సిబ్బంది రూపొందించి ఫెస్ట్‌లో ఉంచారు. దీంతో చిన్నారులు ఆడుతూ పాడుతూ గణితంలోని మెలకువలను నేర్చుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల వ్యవస్థాపకురాలు ధనలక్ష్మి మాట్లాడుతూ పిల్లల మానసిక ఎదుగుదలను ప్రోత్సహించే విధంగా ఈ ఫెస్ట్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రిన్సిపాల్ దివ్యలత, డైరెక్టర్ రామ్ మనోహర్, ఇన్‌సిగ్నిస్ సిబ్బంది పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...