సమాజాన్ని ఆలోచింపజేసే రచనలు రావాలి


Mon,July 22, 2019 01:19 AM

తెలుగుయూనివర్సిటీ: తెలుగు సాహిత్యంలో బలమైన రచనలు యువ రచయితలవి రావ లసిన అవసరం ఉందని ప్రముఖ తమిళ రచయిత అరాత్తు ఆకాంక్షించారు. పొట్టి శ్రీరా ములు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఆదివారం కె. సురేష్, మహ్మద్ ఖదీర్ బాబు సంపాదకత్వంలో కొత్త కథ 2019 పుస్తకావిష్కరణ సభ జరిగింది. 22మంది యువ రచయితల కథలతో కూడిన కొత్త కథ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆయన మాట్లాడుతూ కొత్త తరం రచయితలను సీనియర్ రచయితులు ప్రొత్సహించినపుడే సమాజానికి మంచి రచనలు వస్తాయన్నారు. సమాజాన్ని అర్థం చేసుకుని వారి అలోచన లకు తగినట్లుగా రచనలు సాగిస్తే గొప్ప రచనలుగా పాఠకులను ఆకట్టుకుంటాయన్నారు. ప్రముఖ సాహితీవేత్త డానీ మాట్లాడుతూ ఈ కథలలో రాజకీయ కోణాలలో తక్కువ రచ నలు ఉన్నాయని, ఎక్కువగా సమాజంలో అంశాలను సృశిస్తూ రచనలు సాగడం మంచి పరిణామమన్నారు. ప్రముఖ సాహితీవేత్తలు పి.సత్యవతి, అల్లంరాజయ్య, వివినమూర్తి లకు కథా మార్గదర్శి జ్ఞాపికలను బహుకరించారు. సాహితీ వేత్తలు ఎన్. వేణు గోపాల్, కాత్యాయని మాట్లాడుతూ యువ రచయితల రచనలు ఆధు నిక తరంల ఆలోచలనకు అనుగుణంగా జరగాలన్నారు. సమాజాన్ని ఆలోచింపజేసే రచనలు మరిన్ని రావాలన్నా రు. రైటర్స్ మీట్ మిత్ర బృందంలోని సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రముఖ నృత్య కళాకారిణి శశిర శాస్త్రీయ సంప్రదాయ నృత్యాంశాలతో ఆహుతులను అలరించింది.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...