అంతరిక్షంలోఎన్నో వింతలు..


Mon,July 22, 2019 01:17 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : చంద్రుడిపై కాలుమోపి 50 సంవత్సరాలైన సందర్భంగా యూఎస్ కాన్సులేట్ హైదరాబాద్‌తోపాటు యునైటెడ్ స్టేట్స్ ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ సంయుక్తాధ్వార్యంలో హైదరాబాద్‌లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గత రెండు రోజులు స్పేస్ అండ్ సైన్స్‌పై విద్యార్థ్ధులతో సదస్సు నిర్వహించారు. అపోలో 11 మూన్ వెహికల్‌లో చంద్రుడిపై చేరి 50 సంవత్సరాలు గడిచిన సందర్భంగా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. యూఎస్ కాన్సులేట్ అధికార ప్రతినిధి ఆకాశ్ సూరి మాట్లాడుతూ భారత దేశం కూడా ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించిందని, అంతరిక్ష రహస్యాలు తెలుసుకునేందుకు సరైన సమయమని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన సదస్సులు భవిష్యత్తు ఎదుగుదలకు దోహదం చేస్తుందన్నారు. అదేవిధంగా విద్యార్థుల్లో సైన్స్ స్కిల్స్ పెంపొందించబడుతాయన్నారు. అంతరిక్షంలో ఎన్నో వింతలు దాగి ఉన్నాయన్నారు. ఈకార్యక్రమంలో భాగంగా వాటర్ రాకెట్స్, టెలీస్కోప్స్‌లను పరిశీలించారు. జూలై 16,1969 నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, బజ్ అల్‌డ్రిన్ అపోలో 11 వెహికల్‌లో మొట్టమొదటిసారిగా కాలుపెట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో మనూ మ్యాథమేటిక్స్ డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ నాజాం హసన్, డాక్టర్ ప్రియా హసన్‌తోపాటు వంద మంది విద్యార్థ్ధులు పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...