భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు


Wed,July 17, 2019 03:27 AM

ఎల్బీనగర్, నమస్తే తెలంగాణ ః దక్షిణ షిర్డిగా కీర్తిగాంచిన దిల్‌సుఖ్‌నగర్‌లోని శ్రీ సాయిబాబా దేవాలయంలో గురుపౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయంలో తెల్లవారుజామున నాలుగు గంటల నుండే భక్తులు కిక్కిరిసిపోయి బాబా వారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయడంతో పాటుగా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుండే బాబా ఆలయంలో భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.

ప్రత్యేక పూజలు చేసిన మంత్రి తలసాని, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మల్లేశం
దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా దేవాలయంలో గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రితో పాటుగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం కురుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంరతం కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ప్రజాప్రతిధులను సత్కరించి ప్రసాదం పంపిణీ చేసింది.
చంద్రగ్రహణం కారణంగా బాబా ఆలయాన్ని మూసివేత
మంగళవారం సాయంత్రం వరకు ప్రత్యేక పూజలతో పాటుగా భక్తులకు దర్శనం కోసం అవకాశం కల్పించిన ఆలయ కమిటీ చంద్రగ్రహణం నేపథ్యంలో సాయంత్రం అనంతరం బాబా ఆలయాన్ని మూసి వేశారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...