చల్లటి గాలి చక్కటి చోటు


Tue,July 16, 2019 04:06 AM

-పచ్చని చెట్లు.. రంగురంగుల పక్షులు
-పర్యాటకులను కట్టిపడేస్తున్న ఆక్సిజన్ పార్కు
-రోజురోజుకూ పెరుగుతున్న సందర్శకుల తాకిడి
మేడ్చల్ రూరల్ : మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కండ్లకోయలో 44వ నంబరు జాతీయ రహదారి పక్కన, రింగురోడ్డు జంక్షన్‌కు అతి సమీపంలో ఉన్న ఆక్సిజన్ పార్కు నగర వాసులను విశేషంగా ఆకట్టుకుంటుంది. దాదాపు 70 ఎకరాల్లో ఏర్పాటు చేసిన పార్కులో 2.5 కిలో మీటర్ల వాకింగ్ ట్రాక్, వాకింగ్ బ్రిడ్జి, ఓపెన్ క్లాస్ రూం, హెర్బల్ గార్డెన్, యోగా షెడ్, రెయిన్ బో గార్డెన్ తదితర ఎన్నో సహజ ప్రదేశాలు ప్రజల మనస్సును దోచుకుంటున్నాయి. వచ్చిన వారు మళ్లీ మళ్లీ రావడమే కాదు, తమ కుటుంబం, స్నేహితులు, బంధుమిత్రులతో కలిసి వస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందంగా గడుపుతున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి కాకుండా జాతీయ రహదారిపై వచ్చి పోయే వివిధ జిల్లాలకు చెందిన వారు కూడా ఆక్సిజన్ పార్కులో సేద తీరుతున్నారు. పార్కులోకి వచ్చిన ప్రతి ఒక్కరూ అడవిలోకి వచ్చిన అనుభూతి కల్గుతుందని, నగరానికి ఆనుకొని ఇంత పెద్ద పార్కు ఉండటం సంతోషంగా ఉందని పేర్కొంటున్నారు. పార్కును తీర్చిదిద్దిన ప్రభుత్వానికి, అటవీ శాఖ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు చెపుతున్నారు. నెలలో 10 నుంచి 15వేల మంది పార్కును సందర్శిస్తున్నారు.

ఎక్జోటిక్ పక్షుల సంరక్షణ కేంద్రం ప్రారంభం
ఆక్సిజన్ పార్కులో తాజాగా వాక్ ఇన్ ఐవరీ పేరుతో పక్షుల సంరక్షణ కేంద్రాన్ని మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ కేంద్రంలోని రంగురంగుల పక్షులు సందర్శకులకు కనువిందు చేయనున్నారు. కొద్ది రోజుల్లో సందర్శనకు అవకాశం కల్పించే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పక్షుల నివాసానికి ప్రత్యేక నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. సంరక్షణ కేంద్రంలో గ్రీన్ కన్యూర్ 10, వైట్ కాక్‌టైల్ 60, సిల్వర్ పీసంట్ 4, సన్ కన్యూర్స్ 10, బ్లూ గోల్డ్ మాకావు 4, జెండా కన్యూర్ తదితర పక్షులను పెంచుతున్నారు.

92
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...