వేగంగా పరిష్కరించండి


Tue,July 16, 2019 04:01 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ప్రజావాణిలో స్వీకరించిన పిటిషన్లను త్వరితగతిన పరిశీలించి, పరిష్కరించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ (జేసీ) గుగులోతు రవి అధికారులను ఆదేశించారు. స్వీకరించిన వాటిని ప్రజావాణి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయించి, అధికారులే స్వయంగా పర్యవేక్షించి ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరించాలన్నారు. సోమవారం నాంపల్లిలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి, ఇండ్లు, రుణాలు, ఉపాధి కల్పన, పింఛన్లు, షాదిముబారక్ తదితర అంశాలపై వచ్చిన పిటిషన్లను జేసీ స్వీకరించారు. ఇప్పటి వరకు పలు సమస్యలపై స్వీకరించిన వాటిలో 34 పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటన్నింటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీ భూపాల్‌రెడ్డి, ఆర్డీవోలు శ్రీనివాస్‌రెడ్డి, రాజాగౌడ్, డీఈవో వెంకటనర్స మ్మ, సీపీవో రామభద్రం, ఎల్‌డీఎం శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాన్యానాయక్, ఎస్సీ కులాల అభివృద్ధిశాఖ డీడీ రామారావు, జిల్లా సంక్షేమాధికారి ఝాన్సిలక్ష్మీ, ఉపాధి కల్పనాధికారి మైత్రిప్రియ పాల్గొన్నారు.

ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలి
మేడ్చల్ కలెక్టరేట్: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి కలెక్టర్ ఫిర్యాదులను సేకరించారు. ఆయ న మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెట్టి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలనిఅధికారులకు సూచిం చారు. ఫిర్యాదులను పరిష్కరించడంతో పాటు వారికి సమాధానం పంపించాలని అన్నారు. ప్రజావాణిలో వివిధ సమస్యలపై మొత్తం 48 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డి. శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్‌ఓ మధుకర్‌రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

క్షేత్రస్థాయిలో పర్యటించాలి
మేడ్చల్ కలెక్టరేట్ : ప్రత్యేకాధికారులు తమకు కేటాయించిన మండలాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను గుర్తిం చి నివేదికలను సమర్పించాలని అధికారులను మేడ్చల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి అదేశించారు. సోమవారం కలెక్టరేట్ ప్రజావాణి హాల్‌లో జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం హరితహారం కార్యక్రమంలో ఏవేన్యూ, ఐకాన్ ప్లాంటేషన్ చేయుటకు మున్సిపాలిటీలు, గ్రామాల వారీగా కార్యచరణ ప్రణాళిక తయారు చేసుకొని మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు. నాటిన ప్రతి మొక్కకు జీయోట్యాగింగ్ చేయాలని సూచించారు. గ్రామంలో పంచాయితి కార్యదర్శి, విఆర్‌ఓ, మండలంలో ఎంపీడీఓ, ఈఓపీఆర్‌డీ, తహసీల్థార్, జిల్లాలో డీపీఓ, ఆర్‌డీఓ జాయింట్ సంతకాలతో అక్రమ లేఅవుట్ల గురించి తెలుపుతూ జిల్లా రిజిస్టార్ అధికారికి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయిం ట్ కలెక్టర్ డి. శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్‌ఓ మధుకర్‌రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

భూ సమస్యల పరిష్కారానికి కృషి
కందుకూరు : గ్రామాల్లో రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించడానికి రెవెన్యూ అధికారులు కృషి చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టరు లోకేష్‌కుమార్ అన్నారు. వారంలో మూడు రోజలు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహించాలని ఆదేశించారు. రెవెన్యూ అధికారులు గ్రామాల్లో భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. గ్రామా ల్లో నిర్వహించే రెవెన్యూ సదస్సుల్లో సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించాలని కోరారు. కందుకూరు ఆర్డి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి లో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా రైతులు, ప్రజల నుంచి పలు పిర్యాదులు స్వీకరించి వారితో మాట్లాడారు.
ప్రజావాణికి వచ్చే విజ్ఞప్తులను పరిశీలించి సత్వరమే పరిష్కరించే దిశగా అధికారు లు చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి ఉషారాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశం మం దిరంలో ప్రజావాణి సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాం తాల నుండి వచ్చిన ప్రజల దరఖాస్తులను స్వీకరించారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...