పద్మశాలీలు ఐక్యతతో రాజకీయంగా ఎదగాలి


Mon,July 15, 2019 12:33 AM

అంబర్‌పేట, నమస్తే తెలంగాణ: పద్మశాలీలు ఐక్యంగా ఉండి రాజకీయంగా ఎదగాలని రాష్ట్ర బీసీ కమిషన్‌ చైర్మన్‌ బీఎస్‌.రాములు అన్నారు. జాతీయ ఉద్యమ కాలం నుంచి కుల సంఘాల పాత్ర ఘననీయమైనదన్నారు. డీడీ అండ్‌ సీఈ కాలనీ పద్మశాలి వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పుట్ట పాండురంగయ్య అధ్యక్షతన ఆదివారం ఆత్మీకసమ్మేళనం జరిగింది. దీనికి రాములు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జాతీ య ఉద్యమం నుంచి అనేక ఉద్యమాల్లో పద్మశాలి కుల సంఘాలు ఎంతో పాత్ర పోషించాయని, ప్రస్తు తం పొట్ట కూటికోసం, ఉనికి కోసం పాకులాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పారిశ్రామీకరణ వచ్చిన తర్వాత కులవృత్తులకు పెద్ద దెబ్బ తగిలిందని, అందులో చేనేతపై పెద్దదెబ్బ పడిందన్నారు. చేనేత సహకార సంఘాలకు ప్రాతినిధ్యం వహించిన గత నాయకులు కొందరు చేనేత కార్మికులకు అన్యాయం చేయడం వల్ల ఆ నాయకత్వంపై నమ్మకం పోయిందన్నారు.

ఏ కుల సంఘాల్లో ఇలాంటి అన్యాయం జరుగలేదని చెప్పారు. కులసంఘం అభివృద్ధికి పాటుపడేవారు, సామాజిక సేవ చేసే వారి స్ఫూర్తిని పొందాలనే తత్వం పోయిందన్నారు. సమాజ సేవ చేసే వారి కి తగిన గుర్తింపు ఉంటుందని, వారికి రాజకీయంగా కూడా లాభం చేకూరుతుందని తెలిపారు. సేవ చేయ డం ద్వారానే తృప్తి లభిస్తుందని చెప్పారు. అసోసియేషన్‌ చైర్మన్‌ ప్రొ.తాటికొండ వెంకటరాజయ్య, ఉపాధ్యక్షుడు రాచబత్తిని అజయ్‌కుమార్‌, ప్రధానకార్యదర్శి మహేశుని సుధాకర్‌ అసోసియేషన్‌ ప్రగతిని వివరించారు. అనంతరం బీసీ కమిషన్‌ చైర్మన్‌ రాములును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ కోశాధికారి గుర్రం శ్రీధర్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఎలగందుల అంజయ్య, సభ్యులు మిర్యాల వెం కటేశం, బావాండ్ల ఆంజనేయులు, ముఖ్య సలహాదా రు డాక్టర్‌ పున్న రాజారాం, సలహాదారులు మాచర్ల రంగయ్య, బడుగు నరహరి, సీనియర్‌ సభ్యులు డాక్ట ర్‌ మార్తా రమేష్‌, రేగొండ మాణిక్యం, ఏశాల గోవర్థ నగిరి, గూడురు శ్యాంసుందర్‌, పోరండ్ల శారద తదితరులు పాల్గొన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...