కనులపండువగా భజగోవిందం


Sun,July 14, 2019 12:07 AM

-హాజరైన విద్యారణ్యభారతీస్వామి, రమణాచారి, ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి
రామంతాపూర్ : రామంతాపూర్ ప్రగతినగర్‌లో సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన భజగోవిందం కార్యక్రమం కనులపండువగా సాగింది. అన్నమాచార్య కీర్తనలు ఆహుతులను ఎంతో ఆకట్టుకున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం మహామంత్ర పీఠం ఆధ్వర్యంలో మొట్టమెదటి సారిగా కాలనీలో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో కాలనీవాసులతోపాటు పలువురు పెద్దఎత్తున పాల్గొన్నారు. హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతీస్వామి మాట్లాడుతూ ప్రతి మనిషి ఆశతో కాకుండా ఆశయంతో ముందుకు సాగాలన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి కాలనీలో జరుగాలన్నారు. ప్రభుత్వ సలహాదారుడు కేవీ రమణాచారి, స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ భజగోవిందం ప్రజల్లో మంచి భక్తి భావాలను పెంపొందిస్తుందన్నారు. సాయిరెడ్డి ప్రతి సంవత్సరం భజగోవిందం కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలను భక్తివైపు చైతన్యవంతులను చేయడం అభినందనీయమన్నారు. అనంతరం ముఖ్య అతిథులను సంక్షేమ సంఘం ప్రతినిధులు బొబ్బల వెంకట్‌రెడ్డి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలోవెంకటేశ్వర మహామంత్ర పీఠం అధినేత పుల్లగూర్ల సాయిరెడ్డి, ఆచార్య కసిరెడ్డి వెంకట్‌రెడ్డి, డాక్టర్ రామచంద్రాచారి, విజయలక్ష్మి, కాలనీవాసులు జీఎస్. శ్రీనివాస్‌గౌడ్, రాణాప్రతాప్, కె.వెంకట్‌రెడ్డి, రవీందర్, చిన్నబాబు, మురళీధర్, శ్రీను, వెంకటేశ్వర్‌రావు, రమేశ్‌రెడ్డి, రాజు, వెంకట్‌రావు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...