గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో..


Sun,July 14, 2019 12:06 AM

గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో 4 రోడ్లలో ఎవెన్యూ ప్లాంటేషన్ చేయడానికి గుర్తించారు. మేడ్చల్ చెక్‌పోస్ట్‌లో ఉన్న రెడ్‌సన్ కళాశాల నుంచి అయోధ్య క్రాస్ రోడ్డు వరకు ఉన్న 3 కిలో మీటర్లు, అయోధ్య చౌరస్తా నుంచి గుండ్లపోచంపల్లి వరకు ఉన్న 3 కిలోమీటర్లు, కొంపల్లి వంతెన దాటి తర్వాత మేడ్చల్ వైపు కండ్లకోయ వరకు 44వ జాతీయ రహదారి పక్కన 2 కిలోమీటర్లు, గుండ్లపోచంపల్లి నుంచి కండ్లకోయకు వెళ్లే దారిలో 44వ జాతీయ రహదారి వరకు 2 కిలో మీటర్ల మేరకు ఎవెన్యూ ప్లాంటేషన్ చేయాలని నిర్ణయించారు. ఆయా రోడ్ల పక్కన 10,800 మొక్కలను నాటాలని నిర్ణయించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు 2 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉండే ఐకానిక్ మొక్కలను నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని గుండ్లపోచంపల్లి కమిషనర్ అమరేందర్‌రెడ్డి తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పలు కంపెనీలను ఆర్థిక సహకారం అందించాలని కోరగా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిపారు. కంపెనీలు ఇచ్చిన నిధుల సరిపోకపోతే మున్సిపాలిటీ నుంచి నిధులను వెచ్చిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ విడత హరితహారం కార్యక్రమంలో గుండ్లపోచంపల్లిలో ఉన్న నర్సరీలో 6 లక్షల మరకు మొక్కలను సిద్ధం చేశామన్నారు. ఇప్పటికే ఇండ్లు, కంపెనీలకు 50 నుంచి 60వేల వరకు కోరిన మొక్కలు అందజేశామన్నారు. కాలనీలు, ఇండ్లు, కంపెనీల్లో నాటడానికి మొక్కలు కావాలని ముందుకు వస్తున్నారని తెలిపారు. కాగా మేడ్చల్ మండలం రావల్‌కోల్ పంచాయతీ పాలకవర్గం దొంగలగుట్ట తండా నుంచి బండామైలారం వరకు, రావల్‌కోల్ నుంచి అక్బర్జాపేట వరకు, బ్లాక్ ప్లాంటేషన్ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం గ్రామ పరిధిలో ఉన్న కంపెనీల ఆర్థిక సహకారం కోసం ప్రయత్నిస్తున్నారు. మిగితా గ్రామాల్లో కూడా ఎవెన్యూ ప్లాంటేషన్ కోసం నిధుల సమీకరణకు ప్రణాళికలు రూపొందించుకొని ముందుకెళ్తున్నారు.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...