పూలమొక్కలు.. అందమైన జంక్షన్లు


Sun,July 14, 2019 12:05 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ కింద జీహెచ్‌ఎంసీ నగరంలోని పలు మేజర్ జంక్షన్లతోపాటు ప్రధాన రోడ్లలోని సెంట్రల్ మీడియన్‌లను సీజనల్ పూలమొక్కలతో అలంకరిస్తుంది. ముఖ్యంగా అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌కు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దుతున్నారు. మెట్టుగూడ, ఎల్బీనగర్,సుచిత్ర, లక్డీకాపూల్, ఆరాంఘర్, ఉప్పల్, మూసాపేట్, బుద్ధభవన్ తదితర జంక్షన్లలో సుందరీకరణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. వీటితోపాటు నాంపల్లి స్టేషన్, మహావీర్ దవాఖాన, పోలీస్ కంట్రోల్ రూమ్, మాధవరెడ్డి విగ్రహం జంక్షన్, పబ్లిక్ గార్డెన్ వద్దగల దామోదరం సంజీవయ్య విగ్రహం జంక్షన్, బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహం జంక్షన్ తదితర జంక్షన్లను అలంకరిస్తున్నారు. అలాగే, గాంధీభవన్, తెలుగువర్శిటీ, హియాయత్‌నగర్, ఉప్పల్, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్ రోడ్ నెం-45, జూబ్లీహిల్స్ రోడ్ నెం-36, కేబీఆర్ పార్క్, ఎన్‌ఎఫ్‌సీఎల్, మెట్టుగూడ రైల్వే క్వార్టర్స్, ఓయు రోడ్ తదితర సెంట్రల్ మీడియాలను కూడా పూలమొక్కలతో సుం దరీకరిస్తున్నారు. వీటితోపాటు ఇందిరాపా ర్క్, జూబ్లీహిల్స్‌లోని రాక్‌గార్డెన్‌లను కూడా సుందరీకరించాలని నిర్ణయించారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...