నిరీక్షణ..


Fri,July 12, 2019 01:57 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: పేట్లబుర్జ్ ప్రసూతి దవాఖాన (జజ్జిఖాన)లో ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ విధానం సత్ఫలితాలిస్తున్నది. మొట్టమొదటిసారిగా నిలోఫర్ దవాఖానలో ప్రవేశపెట్టిన ఈ విధానం అక్కడ విజయవంతం కావడంతో పేట్లబుర్జ్ ప్రసూతి దవాఖానలో ఏడాది క్రితం పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రవేశపెట్టారు. ప్రారంభంలో రోజుకు 30 మంది చొప్పున అపాయింట్‌మెంట్ విధానం ద్వారా గర్భిణులకు వైద్యసేవలు అందించారు. వారానికి మొత్తం ఆరు యూనిట్ల ద్వారా అక్కడ వైద్యసేవలు అందిస్తున్నట్లు దవాఖాన సూపరింటెండెంట్ డా.నాగమణి తెలిపారు.

నిరీక్షణ నుంచి విముక్తి..
ప్రతిరోజు సుమారు 150 నుంచి 200 మంది గర్భిణులు ఓపీ సేవల కోసం పేట్లబుర్జ్ ప్రసూతి దవాఖానను ఆశ్రయిస్తుంటారు. గర్భిణులకు ఇబ్బందులు రాకుండా వైద్యంతో పాటు నిరీక్షణ లేకుండా ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. దీంతో ముందుగానే 18005994325 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించి రోగి వివరాలు తెలపాలి. ఈ మేరకు వివరాలు స్వీకరించిన సిబ్బంది దవాఖానకు రావాల్సిన తేదీ, సమయాన్ని కేటాయిస్తారు. వచ్చిన వెంటనే కేటాయించిన అపాయింట్‌మెంట్ సమయం ఆధారంగా వారికి వైద్య సేవలు అందుతాయి.

రోజుకు 70మందికి...
ప్రతి రోజు సుమారు 70 మందికి అపాయింట్ మెంట్స్ ఇస్తున్నట్లు దవాఖాన సూపరింటెండెంట్ డా.నాగమణి తెలిపారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అయింట్‌మెంట్ పద్ధతిలో ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. దీంతో గర్భిణులకు ఎంతో మేలు జరుగుతుందని, ముఖ్యంగా గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించే ఇబ్బందులు తప్పాయని ఆమె వివరించారు. గైనిక్, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, ప్రసవాలు తదితర సేవలను యథావిధిగా కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...