భక్తులకు ఇబ్బందులు రానివ్వొద్దు


Fri,July 12, 2019 01:55 AM

బేగంపేట: ఈ నెల 21న నిర్వహించే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆదేశించారు. గురువారం సచివాలయంలోని తన చాంబర్‌లో రాంగోపాల్‌పేట కార్పొరేటర్ అరుణాగౌడ్, పోలీస్ అధికారులు, దేవాలయ శాఖ అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. భక్తులకు అందించే పాస్‌ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. నకిలీ పాస్‌లు లేకుండా బార్ కోడింగ్‌తో అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సాధారణ క్యూలైన్లలో వెళ్లే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అదేవిధంగా నల్లగుట్ట, రాంగోపాల్‌పేట, పాన్ బజార్ తదితర ప్రాంతాల నుంచి బోనాలతో వచ్చే వారికి పాత రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్ నుంచి అలాగే మోండామార్కెట్, టకారబస్తీ, ఓల్డ్ బోయిగూడ ప్రాంతాల నుంచి బోనాలతో వచ్చే మహిళలకు బాటా నుంచి దర్శనానికి వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. శివసత్తులు నేరుగా దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహంకాళి ఏసీపీ వినోద్‌కుమార్, ఇన్‌స్పెక్టర్ జైపాల్‌రెడ్డి, దేవాలయ కార్యనిర్వహణాధికారి అన్నపూర్ణ, పండితులు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...