చిన్నారులు, మహిళల రక్షణకు..


Thu,July 11, 2019 01:12 AM

- ఆరు రక్షణ విభాగాలు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మహిళలు, బాలల రక్షణకు ఆరు విభాగాలు రక్షణగా కవచంలా నిలుస్తున్నాయి. వారికి ఎలాంటి ఆపద వచ్చినా ఈ విభాగాల పోలీసు అధికారులు అందుబాటులో ఉంటున్నారు. వారికి చట్టపరమైన చర్యలతోపాటు కౌన్సెలింగ్‌లతో వారికి భరోసా కలిగిస్తున్నారు. భరోసా, బాలమిత్ర, ఆపరేషన్ ైస్మెల్, ఆసరా, షీ టీమ్స్, కళాబృందాలు ఇలా ఈ ఆరు విభాగాలు వారి స్థాయిలో మహిళలు, బాలబాలికలకు పూర్తి భద్రతను కల్పిస్తున్నారు. బాలబాలికల నుంచి వృద్ధుల వయస్సు వరకు వారు ఎదురయ్యే సమస్యలను పరిష్కరిస్తూ ఈ వర్గాల వారందరిలో ఆత్మైస్థెర్యం నింపుతున్నారు.

భరోసా కేంద్రం : ఈ కేంద్రం ద్వారా సైబరాబాద్ పోలీసు అధికారులు దాదాపు 375 మంది మహిళల సమస్యలను పరిష్కరించారు. విడాకులు తీసుకోకుండా కుటుంబాలను కలిపారు. మద్యానికి బానిసైన వారికి కౌన్సెలింగ్ అందించి వారిలో మార్పు తీసుకువచ్చారు. మహిళలు, బాలికలకు అందాల్సిన చట్టం, వైద్యం, ఇతర సౌకర్యాలను ఈ కేంద్రం ద్వారా అందిస్తున్నారు. భరోసా సేవలను పొందాలనుకునే వారి కోసం వాట్సాప్ నం. 9490617261, bharosa.cyberbad facebook page, [email protected] ఐడీలలో సంప్రదించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఆపరేషన్ ైస్మెల్ : ఈ విభాగంలో పని చేస్తున్న సిబ్బంది దాదాపు 581 బాలబాలికలను కాపాడి వారిని వెట్టి చాకిరి, భిక్షాటన, ఇతర నిర్బంధపు చాకిరీ నుంచి కాపాడారు. బాల కార్మికుల గురించి సమాచారం ఇవ్వడం కోసం వాట్సాప్ నం.7901115474, ఫేస్‌బుక్[email protected], మెయిల్ [email protected] సేవలను అందుబాటులోకి తెచ్చారు.

కళా బృందం : ఈ విభాగం దాదాపు 50వేల మంది మహిళలకు వారిపై జరిగే అఘాయిత్యాలతోపాటు వాటిని ఎదుర్కొనేందుకు అవసరమయ్యే సమాచారాన్ని పాటలు, నాటకాల రూపంలో అవగాహన కల్పించారు. వారి రక్షణకు ఉన్న చట్టాల గురించి కూడా వివరిస్తారు.

షీ టీమ్స్
పోకిరీలు, ఈవ్‌టీజర్‌ల నుంచి సైబరాబాద్ షీటీమ్స్ ఇప్పటి వరకు వెయ్యికి పైగా కేసులను నమోదు చేసి వారి భరతం పట్టిం ది. అంతేకాకుండా మైనర్లకు కౌన్సెలింగ్ ఇచ్చి మరోసారి తప్పు చేయకుండా మార్పు తీసుకువచ్చింది. షీటీమ్స్ సేవలను పొందేందుకు ఫేస్‌బుక్-sheteamcyber100, వాట్సాప్ నం.949061 7444, మెయిల్-sheteam. cybera [email protected] సోషల్ మీడియా వేదికల ద్వారా సంప్రదించే అవకాశాన్ని కల్పించింది.

ఆసరా
ఈ బృందం దాదాపు 50మంది వృద్ధులను దగ్గరకు తీసి వారిని చంచల్‌గూడ ఆనందాశ్రమానికి పంపించింది. రోడ్డు మీద భిక్షాటన చేస్తున్న వృద్ధులను గుర్తించి వారు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చింది. కష్టాలు పడుతున్న వృద్ధులకు సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు ఫేస్‌బుక్[email protected] cyberabda, వాట్సాప్ నం. 7901115474, మెయిల్[email protected] వేదికలను కల్పించారు.

బాలమిత్ర
ఈ విభాగం అధికారులు 16 ఫిర్యాదులపై దర్యాప్తు చేసి రెండు ఎఫ్‌ఐఆర్‌లు, 14 పెట్టీ కేసులను నమోదు చేసింది. లైంగిక దాడుల్లో బాధితులుగా ఉన్న బాలబాలికలకు అధికారులు అండగా ఉంటారు. వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలను అందించి వారిలో నెలకొన్న భయాందోళనను తొలగించి వారిలో నమ్మకాన్ని నింపుతారు. బాధిత బాలబాలికలకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే ఫేసుబుక్[email protected] cyberabd, వాట్సాప్ నం.9490617444, మెయిల్-sheteam. [email protected] comలో ఫిర్యాదు చేయడానికి అవకాశాన్ని కల్పించారు. ఈ ఆరు విభాగాలు నిరంతరం సేవలను అందిస్తూ మహిళలు, బాలబాలిక భద్రతకు పూర్తి భరోసాను కల్పిస్తున్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...