జలశక్తి అభియాన్‌కు అంకురార్పణ


Thu,July 11, 2019 01:11 AM

రంగారెడ్డి జిల్లా,నమస్తే తెలంగాణ: నీటిని ఒడిసి పట్టే మహా ఉద్యమం ఆరంభమైంది. అడుగంటిన గంగ మ్మను పైకి తెచ్చే భగీరథ ప్రయత్నం మొదలైంది.కరవు ఛాయలతో అల్లాడుతున్న ధరణిపైకి జలసిరులను తీసుకువచ్చే క్రతువు షురువైంది. కేంద్ర ప్రభుత్వంజలశక్తి అభియాన్‌కు అంకురార్పణ చేసింది. ఈ పథకం కింద జిల్లాలోని 8 మండలాలను ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా పరిధిలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) కేంద్ర బృందం పర్యటనకు ఏర్పాట్లు చేస్తుంది. జిల్లాలోని రాజేంద్రనగర్, సరూర్‌నగర్, శంషాబాద్, మొయినాబాద్, కొందుర్గు, కొత్తూ రు, తలకొండపల్లి, ఆమనగుల్లు మండలాలను మొదటి దశలో ఎంపిక చేశారు. జిల్లాలో నీటి సంరక్షణకు బ్లాకులుగా విభజించి,ప్రత్యేక అధికారులను నియమించింది. ఇక రెండో దశలో మిగిలిన మండలాలను ఎంపిక అయ్యే అవకాశం ఉం ది. పట్టణ ప్రాంతాలైన రాజేంద్రనగర్, సరూర్‌నగర్‌లో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో జల్‌శక్తి పథకాన్ని అమలు చేయనున్నారు.

జిల్లా ప్రత్యేకాధికారిగా జాయింట్ సెక్రటరీ హోదా గల వీకే జిందాల్ (ఐఏఎస్)ని సెంట్రల్ నోడల్ అధికారి(సీఎన్‌ఓ)గా నియమించింది. పథకం అమలు,పనుల పర్యవేక్షణ కోసం సీఎన్‌ఓ కింద మరో నలుగురు బ్లాక్ నోడల్ ఆఫీసర్లను నియమించింది.ఎంపికైన ఈ మండలాల్లో కొత్త పంచాయతీలు 2015, పాత పంచాయతీలు 130 ఉన్నాయి.జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కొనసాగుతున్న 122 గ్రామాలకు గాను మొదట 59 గ్రామాలను ఎంపిక చేశారు.ఆ తర్వాత దశలో మిగిలి 63 పం చాయతీల్లో జల్‌శక్తి అభియాన్ పథకం కొనసాగిస్తారు.

ఈ పథకం కింద చేపట్టాల్సిన కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొదించింది.

- మొదట ప్రజల్లో జల సంరక్షణపై విస్తృత అవగాహన కల్పిస్తారు.

- అధికారులు,నిపుణులు,స్వచ్ఛంద సంస్థల సహకారంతో నీటి వృథా అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు వివరిస్తారు.

- శాస్త్రవేత్తలు,ఐఐటీ విద్యార్థులు,నిపుణులను భాగస్వామ్యం చేస్తారు.

- వర్షపునీటి సంరక్షణ,నీటి వనరుల పునరుద్ధరణ,బోరుబావుల రీఛార్జీ/పునర్వినియోగించుకునేలా చేయడం,వాటర్ షెడ్‌ల నిర్మాణం,ఉద్యమంగా మొక్కల పెంపకం చేపట్టాలి.

-పట్టణ ప్రాంతాల్లో వృథా నీటితో మొక్కలు పెంచుకునేందుకు వినియోగించేలా చూస్తారు.

రేపు కేంద్ర బృందం రాక
ప్రత్యేక నోడల్ అధికారులు ఈనెల 12,13,14 తేదీలో మూడు రోజుల పాటు జల్ శక్తి పథకంలో ఎంపికైన మండలాల్లో పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులతో కేంద్ర బృందం జల్‌శక్తి అభియాన్‌పై సమీక్షించానున్నారు. ఆ తర్వాత ఎంపిక చేసిన మండలాల వారీగా పర్యటన కొనసాగనుంది.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...