లష్కర్‌కు జాతర కళ..


Wed,July 10, 2019 12:35 AM

బేగంపేట:లష్కర్ మహంకాళి అమ్మవారి జాతరలో భాగంగా ఈ నెల 7వ తేదీన అమ్మవారి ఘటోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.రెండు వారాల పాటు సికింద్రాబాద్‌లోని వివిధ బస్తీలలో అమ్మవారి ఘటాలను ఊరేగిస్తారు. ఒక్కోరోజు ఒక్కో ప్రాంతంలో ఘటాన్ని డప్పు దరువులతో ఊరేగిస్తున్నారు.

సీతారామ కల్యాణ హరికథ..
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సీతారాముల కల్యాణం హరికథ నిర్వహించారు. ఎస్ చిరంజీవాచార్యులు హరికథను వినిపించారు. దేవాలయం ప్రాంగణంలో సుమారు రెండు గంటల పాటు చెప్పిన హరికథను భక్తులు ఆసక్తిగా విన్నారు. తొలుత తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరక్టర్ మామిడి హరికృష్ణ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈవో అన్నపూర్ణ హరికథను చెప్పిన చిరంజీవాచార్యులను, సాంస్కృతిక శాఖ డైరక్టర్ మామిడి హరికృష్ణను సత్కరించారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...