అక్షరాస్యతతోనే అభివృద్ధి సాధ్యం


Wed,July 10, 2019 12:32 AM

మలక్‌పేట : అక్షరాస్యతతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర వయోజన విద్యాశాఖ సంచాలకులు ఎన్‌సీహెచ్.వరదాచార్యులు అన్నారు. జిల్లా వయోజన విద్యాశాఖ అక్షరజ్యోతి సమితి ఆధ్వర్యంలో పాత మలక్‌పేట డివిజన్‌లోని సాలార్ ఇ మిల్లత్ కమ్యూనిటీహాల్‌లో మంగళవారం నిర్వహించిన అక్షరాస్యత ఏడవ కోర్సు వలంటీర్ల శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతోనే వికాసమని, సమాజంలో అందరూ అక్షరాస్యులైతే అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. అక్షరాస్యత ఆవశ్యకత, ప్రాముఖ్యతను వివరించిన ఆయన, పేదరిక నిర్మూలన అంటే అందరూ విద్యావంతులు అవడమేనని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని సూచించారు. పేదరిక నిర్మూలనను సామాజిక బాధ్యతగా ప్రతిఒక్కరూ బస్తీల్లోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేసేందుకు కృషిచేయాలని సూచించారు. వయోజన విద్య ఉపసంచాలకులు వి.నాగలక్ష్మీ, ఎస్‌ఆర్‌సీ సంచాలకులు సాయన్న, కార్పొరేటర్ మినాజుద్దీన్, ఎంఐఎం నాయకుడు షఫీ, సంచాలకులు ఎం.మానయ్య, నాజియా, వయోజన విద్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...