ముంపునకు ముగింపు ఇలా..


Tue,July 9, 2019 01:06 AM

సిటీబ్యూరో: నగరంలో ముంపు సమస్యను పరిష్కరించేందుకు ఇంజక్షన్ బావులతో కూడిన ఇంకుడు గుంతలతోపాటు తటాకాలను ఏర్పాటు చేయాలని, పైప్‌లైన్ల ద్వారా నీటిని సమీపంలోని చెరువుల్లోకి మలపాలని జేఎన్‌టీయూ ప్రొఫెసర్లు సూచించారు. ఇంజక్షన్ బావులతో భూగర్భ జలాలు ఉప్పొంగుతాయని, అలాగే ముంపు సమస్య కూడా చాలావరకు తగ్గించవచ్చని తెలిపారు. అలాగే ప్రభుత్వ స్థలాల్లో సుమారు 10 నుంచి 20 మీటర్ల మేర తవ్వకాలు జరిపి తటాకాలు ఏర్పాటు చేస్తే వరద నీటిని అందులో నిల్వ చేయవచ్చని పేర్కొన్నారు. దీనివల్ల ముంపు సమస్యను తగ్గించడంతో పాటు భూగర్భజలాలను పెంచవచ్చన్నారు. ఈ మేరకు వారు బల్దియాకు ఓ నివేదిక సమర్పించారు. తాత్కాలికంగా ముంపును అరికట్టేందుకు ఈ చర్యలు సరిపోతాయని, శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర అధ్యయనం చేయాలని వారు స్పష్టం చేశారు.

క్షేత్రస్థాయిలో పర్యటించి..
ఇటీవల వచ్చిన భారీ వర్షానికి వెస్ట్‌జోన్‌తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో తీవ్ర ముంపు సమస్య ఏర్పడిన విషయం తెలిసిందే. దీనిపై ఈనెల 2న బల్దియా కమిషనర్ దానకిశోర్ జేఎన్‌టీయూకి చెందిన ప్రొఫెసర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ముంపు సమస్య పరిష్కారానికి సూచనలు చేయాలని కోరారు. దీంతో ఈనెల మూడు, నాలుగు తేదీల్లో వారు ప్రధాన ముంపు ప్రాంతాలను సందర్శించి తాత్కాలిక ఉపశమనం కోసం కొన్ని సూచనలు చేశారు. ప్రొఫెసర్ గిరిధర్ ఖైరతాబాద్, సికింద్రాబాద్, చార్మినార్ తదితర మూడు జోన్లను సందర్శించి నివేదిక ఇవ్వగా, ప్రొఫెసర్. లక్ష్మణ్‌రావు శిల్పారామంతో పాటు వెస్ట్‌జోన్ ప్రాంతంపై నివేదిక సమర్పించారు. జీహెచ్‌ఎంసీ చీఫ్ ఇంజినీర్ జియావుద్దీన్‌తోపాటు ఇంజినీరింగ్ అధికారులతో వారు క్షేత్రస్థాయిలో పర్యటించి ఈ విధంగా సూచనలు చేశారు. వారిచ్చిన నివేదిక ప్రకారం ప్రధాన ముంపు ప్రాంతాల్లో తాత్కాలిక ముంపు పరిష్కార మార్గాలు ఈ విధంగా ఉన్నాయి....

ఖైరతాబాద్ జోన్...
-లేక్ వ్యూ గెస్ట్‌హౌస్ ప్రవేశద్వారం వద్ద రెండు ఇంజక్షన్ వెల్స్‌తో కూడిన ఇంకుడు గుంత నిర్మించాలి. అలాగే లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌కి రోడ్డుకు మధ్య కుడివైపు, లేక ఎడమవైపు రెండు ఇంజక్షన్ వెల్స్‌తోకూడిన ఇంకుడు గుంత నిర్మించాలి. వరదనీరు ఈ గుంతల్లోకి వెళ్లేలా ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా గెస్ట్‌హౌస్ ఎదురుగా ఉన్న నాలాలో పూడిక తొలగించాలి.
-రాజ్‌భవన్ నుంచి సోమాజిగూడ రోడ్డు మధ్య బస్టాండు వద్ద ఇంజక్షన్ వెల్‌తోకూడిన ఇంకుడు గుంత నిర్మాణం చేయాలి. అలాగే ఈ ఇంకుడు గుంతకు వరదనీరు వెళ్లే విధంగా కాలువను ఏర్పాటు చేయాలి.n బేగంబజార్ పీఎస్ వద్ద రెండు అడుగుల నుంచి నాలుగు అడుగుల ఎత్తు వరకు కల్వర్టుపై ఇరు వైపులా గోడ నిర్మాణం చేయాలి. వరదనీటితో పాటు ఘనవ్యర్థాలు పోలీస్‌స్టేషన్ వైపు రాకుండా ఉండేలా నియంత్రించాలి. నాలాలోనికి వ్యర్థాలు వెళ్లకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి. మాన్‌సూన్ ముగిసే వరకూ రోజూ నాలాలో వ్యర్థాల తొలగింపు పనులు చేపట్టాలి.
-కార్వాన్‌లోని హెచ్‌ఎస్ రాయల్ రెసిడెన్సీ ఎదురుగా రెండు ఇంజెక్షన్ వెల్స్‌తో కూడిన ఇంకుడు గుంతను నిర్మించాలి.

సికింద్రాబాద్ జోన్....
-ఛే నెంబర్ చౌరస్తాలోని సులభ్ కాంప్లెక్స్ వద్ద రెండు ఇంజక్షన్ వెల్స్‌తో కూడిన ఇంకుడు గుంతను నిర్మించాలి. అలాగే, ఈ గుంతలోకి వరద నీరు వెళ్లే విధంగా తగిన ఏర్పాట్లు చేయాలి.
-బతుకమ్మకుంట వైభవ్ కాలనీ వద్ద ముంపును అరికట్టేందుకు మూడు ఇంజక్షన్ వెల్స్‌తో కూడిన ఇంకుడు గుంతను నిర్మించాలి. మురుగునీరు వరదనీటిలో కలవకుండా కాలనీ చివర నాలుగడుగుల గోడను, స్పోర్ట్స్ క్లబ్ క్రాస్‌రోడ్స్ వద్ద కూడా రెండు ఇంజక్షన్ వెల్స్‌తో కూడిన ఇంకుడు గుంతను నిర్మించాలి. అలాగే, వరదనీరు ఆ గుంతలోనికి ప్రవేశించే విధంగా తగిన ఏర్పాట్లు చేయాలి.
చార్మినార్ జోన్...
-ఖాదీ భండార్ వద్ద రెండు ఇంజక్షన్ వెల్స్‌తో కూడిన ఇంకుడు గంతను నిర్మించాలి. అలగే వరదనీరు ఆ గుంతలోనికి ఇంకే విధంగా తగిన ఏర్పాట్లు చేయాలి. వరదకు అనుగుణంగా ఇంకుడు గంతను డిజైన్ చేయాలి.n మలక్‌పేట్ పోలీస్‌స్టేషన్ వద్ద బాక్స్ డ్రెయిన్ సమీపంలో ఇంజక్షన్ వెల్‌తో కూడిన ఇంకుగు గుంత నిర్మాణం చేయాలి. మెట్రో స్టేషన్‌వైపు నుంచి వచ్చే వరదను ఈ ఇంకుడు గుంతలోనికి వెళ్లే విధంగా తగిన ఏర్పాటు చేయాలి.n అక్షయ హోటల్ వద్ద రెండు ఇంజక్షన్ వెల్స్‌తోకూడిన ఇంకుడు గుంతను నిర్మించాలి. వరదనీరు ఆ గుంతలోనికి వెళ్లే విధంగా తగిన ఏర్పాట్లు చేయాలి.
-ఓల్డ్ మలక్‌పేట పార్కు సమీపంలోని వాటర్‌బోర్డుకు చెందిన నీటి ట్యాంకు వద్ద మూడు ఇంజక్షన్ వెల్స్‌తోకూడిన ఇంకుడు గుంతను నిర్మించాలి.
-సిటీలైఫ్ ఫర్నిచర్స్ వద్ద రెండు ఇంజక్షన్ వెల్స్‌తోకూడిన ఇంకుడు గుంతను నిర్మించాలి. వరదనీరు ఆ గుంతలోనికి వెళ్లే విధంగా తగిన ఏర్పాట్లు చేయాలి.
-ఆజంపురా ఆర్‌యూబీ వద్ద కల్వర్టుపై రెండు అడుగుల ఎత్తు వరకు సైడ్ వాల్ నిర్మాణం చేయాలి. వరద ఆధారంగా అవసరాలకు అనుగుణంగా ఈ గోడను నాలుగు అడుగులకు పెంచాలి. అలాగే ఎగువ ప్రాంతం నుంచి ఆర్‌యూబీవైపు వ్యర్థాలు కొట్టుకొని రాకుండా తగిన ఏర్పాట్లు చేయాలి. నాలాలో పూడికతీయడంతోపాటు వరదనీటితోపాటు వ్యర్థాలు రాకుండా ఉండేందుకు తరచూ ఆ ప్రాంతంలో వ్యర్థాల తొలగింపు కార్యక్రమం చేపట్టాలి.n వలీ ఫంక్షన్ హాల్ వద్ద రోడ్డు ఎత్తును 1.5అడుగులమేరకు, అలాగే ఫిజా హోటల్ వద్ద రోడ్డును ఒక అడుగు ఎత్తుకు పెంచాలని సూచించారు. కాగా, వలీ ఫంక్షన్ హాలు వద్ద ఇప్పటికే బాక్స్ డ్రెయిన్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఫిజా హోటల్ వద్ద సైతం నీరు నిల్వకుండా తగిన చర్యలు తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు.
-శిల్పారామం వద్ద ముంపును పైప్‌లైన్ ఏర్పాటుచేసి దాన్ని తిమ్మిడికుంట చెరువుకు కలపాలి. అలాగే, ఎగువనుంచి వచ్చే వరద ద్వారా వ్యర్థాలు రాకుండా పలుచోట్ల క్యాచ్‌మెంట్ పిట్స్‌ను ఏర్పాటు చేయాలి. ఒకవేళ పైప్‌లైన్లు వేయనిపక్షంలో నీటిని పంపింగ్‌చేయాలి. రోడ్డును కొంత ఎత్తుకు పెంచాలి. సైబర్‌టవర్స్, గూగుల్ వైపు నుంచి వచ్చే వరదను తుమ్మిడికుంట చెరువుకు మళ్లించాలి. వరదను తగ్గించేందుకు పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో పది నుంచి 20 మీటర్లలోతు వరకు తటాకాలను నిర్మించాలి.
-వెస్ట్‌జోన్‌లోని ఇతర ప్రాంతాల్లో రోడ్డు మధ్యలో కిందిభాగం నుంచి వరదనీటి పైప్‌లైన్‌ను ఏర్పాటు చేయాలి. ఇరువైపులా డ్రెయిన్‌లోనికి నీరు వెళ్లేలా పైప్‌లైన్, రోడ్డుకు ఇరువైపులా పైప్‌లైన్‌ను ఏర్పాటు చేసి దుర్గంచెరువుతో అనుసంధానం చేయాలి.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...