మరిన్ని కూడళ్లలో.. ఎల్‌ఈడీ స్టాప్‌లైన్లు!


Tue,July 9, 2019 01:00 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్న సరికొత్త ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థపై దేశంలోని పలు రాష్ర్టాలు ఆసక్తిని కనబరుస్తున్నాయి. మరో పక్క హైదరాబాద్‌లోని మరిన్ని ముఖ్య కూడళ్లకు ఈ వ్యవస్థను విస్తరించేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. డిటిటల్ సిగ్నలింగ్ వ్యవస్థ (సిగ్నల్ యాక్టివేటెడ్ ఎల్‌ఈడీ స్టాప్ లైన్)ను ఈ నెల 1న నగర ట్రాఫిక్ పోలీసులు కేబీఆర్ పార్కు చౌరస్తాలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఈ విధానంతో రాత్రి వేళ కూడా ఉల్లంఘనలకు పాల్పడిన వాహనచోదకుల ఫొటోలకు చలాన విధించవచ్చు. చెన్నైకి చెందిన ఓ సంస్థ నుంచి డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాలతో నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్‌కుమార్ ఈ వ్యవస్థను హైదరాబాద్‌లో వినియోగంలోకి తెచ్చారు. ఈ విధానంపై ఇటీవల బాలీవుడ్ హిరో అమితాబచ్చన్ కూడా ట్వీట్ చేశారు.

ఐదు కూడళ్లకు విస్తరణ..!
కేబీఆర్ పార్కు వద్ద ఏర్పాటు చేసిన ఈ సిస్టంను జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, మోనప్ప ఐలాండ్, తిరుమలగిరి, మదీనా, ఖైరతాబాద్ జంక్షన్లకు విస్తరించేందుకు నగర ట్రాఫిక్ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. రెండేండ్ల వరకు నిర్వహణ బాధ్యతలను సంస్థ తీసుకోవడంతో త్వరలోనే నగర వ్యాప్తంగా ఈ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి.

ఇతర రాష్ర్టాల ఆసక్తి...
ఎల్‌ఈడీ స్టాప్ లైన్ సిస్టమ్‌ను సోషల్‌మీడియా ద్వారా గుర్తించిన వివిధ రాష్ర్టాల పోలీసులు హైదరాబాద్ పోలీసులకు ఫోన్లు చేసి తెలుసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌ఘఢ్, మహారాష్ట్ర, కర్ణాటక పోలీసులు హైదరాబాద్ పోలీసులను సంప్రదిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో యుద్ధప్రాతిపదికన ఈ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...