ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులు ఖరారు


Tue,July 9, 2019 12:57 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :నగరంలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల ఫీజుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. ఓవైపు అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుండడంతో ఫీజుల వ్యవహారంపై కొద్దిరోజుల పాటు ప్రైవేటు కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో వసూలు చేయాల్సిన ఫీజులను అడ్మిషన్స్ అండ్ ఫీజుల రెగ్యులేటరీ కమిటీ(ఏఎఫ్‌ఆర్సీ) నిర్ణయిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ కమిటీ ఖరారు చేసిన ఫీజులను వ్యతిరేకిస్తూ.. కొన్ని కాలేజీల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. హైకోర్టు ఫీజులు పెంచుకోవచ్చని చెప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సుప్రీంకోర్టు మెట్లెక్కారు. తాజాగా ఈ విషయంపై సుప్రీం కోర్టు ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలు ఇష్టం వచ్చినట్లు ఫీజులు పెంచుకోవడం కుదరదు. ఫీజుల కమిటీ ఎంత చెబితే అంతే వసూలు చేయాలి అని తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ కాలేజీల ఫీజుల నిర్ణయిస్తూ తెలంగాణ ఉన్నత విద్యాశాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ నిర్ణయించిన మేరకు ఫీజుల వివరాలతో జీవోను జారీ చేసింది. ఉన్నత విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వుల వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ జీవోలో కోర్టుకు వెళ్లిన కాలేజీలు, కోర్టు మెట్లెక్కని కాలేజీలకు ఫీజులు నిర్ణయించడంతో పాటు తాత్కాలికంగా మరికొన్ని కాలేజీలకు నిర్ణయించిన ఫీజుల జాబితాను వెల్లడించారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...