క్షేత్రస్థాయి సమస్యలపై నివేదిక ఇవ్వాలి


Tue,July 9, 2019 12:57 AM

మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి: క్షేత్రస్థాయిలో ప్రత్యేకాధికారులు పర్యటించి ప్రజల సమస్యలపై క్రమంతప్పకుండా నివేదిక అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డి.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీటిం గ్ హాల్‌లో జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా తమతమ పరిధిలో నిత్యం పర్యటించాలన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, గతంలో అసెంబ్లీ, పార్లమెంట్, పంచాయతీ ఎన్నికలను నిర్వహించిన అనుభవంతో మున్సిపల్ ఎన్నికలను కూడా పటిష్టంగా నిర్వహించాలన్నారు. 13 మున్సిపాలిటీల్లో 5.69లక్షల ఓటర్లున్నారని, 289 వార్డుల్లో 567 పోలింగ్ స్టేషన్లను గుర్తించామని జాయింట్ కలెక్టర్ తెలిపారు. మున్సిపాలిటీల్లో జనసాంద్రత ఎక్కువగా ఉన్నందున ప్రతి 8వేల ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఈనెల 10వ తేదీన డ్రాఫ్ట్ పబ్లికేషన్ విడుదల చేస్తామన్నారు. 10వ తేదీ నుంచి 12 వరకు అభ్యంతరాలు స్వీకరించాల్సి ఉంటుందన్నారు. అలా గే రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలన్నారు. ఎన్నికల విధులు నిర్వహించుటకు నోడల్ అధికారులను నియమించడం జరిగిందని, వారికి కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలన్నారు. ఎన్నికల పరివర్తన నియమావళిని పటిష్టంగా అమలుచేయాలన్నారు. ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ టీంలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి మున్సిపాలిటీలో ముడు బృందాలను ఏర్పాటు చేసి 24 గంటలు విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. డీఆర్‌సీ, స్ట్రాంగ్‌రూంల ఏర్పాటు, కౌంటింగ్ సెంటర్లను గుర్తించాలన్నారు. ఎన్నికల విధులకు అవసరమైన సిబ్బందిని నియమించడంతో పాటు వారికి శిక్షణ తరగతులను నిర్వహించాలన్నారు. రవాణా సౌకర్యానికి అవసరమయ్యో బస్సులను గుర్తించాలని, హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేయాలన్నా రు. ఎన్నికలకు అవపసరమయ్యే మెటీరియల్‌ను సిద్ధం చేయాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని, బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. మున్సిపల్ ఎన్నికలను పటిష్టంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్వో మధుకర్‌రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...