ప్రతి ఇంటిపై గులాబీ జెండా ఎగురాలి


Tue,July 9, 2019 12:56 AM

మేడ్చల్ కలెక్టరేట్ : టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు దేశంలోనే నంబర్ వన్‌గా నిలుస్తుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొనారు. సోమవారం దమ్మాయిగూడ, నాగారం, అహ్మద్‌గూడలో టీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి నాయకులు, కార్యకర్తలకు పార్టీ సభ్యత్వాలను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఇంట్లో టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఉండాలని, ప్రతి ఇంటిపై గులాబీ జెండాను ఎగురవేయాలని సూచించారు. గత పాలకులు 60 సంవత్సరాల్లో ప్రజలకు ఏమి చేయ్యలేదని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం గడిచిన ఐదేండ్లలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి పేదలకు అందజేస్తుందని అన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో లక్షకు పైగా సభ్యత్వాలు నమోదు చేయడమే లక్ష్యంగా ముందు కు పోవాలని పిలుపునిచ్చారు. మేడ్చల్ జడ్పీచైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మన్ బెస్త వెంకటేశ్, రాష్ట్ర నాయకులు చామకూర భద్రారెడ్డి, సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ కౌకుట్ల చంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ మాదిరెడ్డి స్వప్నావెంకట్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ రమాదేవి, ఉపాధ్యక్షులు శ్రీధర్, సహకార సంఘం చైర్మన్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...