ఎస్సీ,ఎస్టీ బాధితులకు సత్వరమే స్వాంతన..


Mon,July 8, 2019 12:07 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం క్రింద అవమానానికి గురైన బాధితులకు సత్వరమే స్వాంతన చేకూర్చేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది. చట్టం ప్రకారం వారికి సక్రమించాల్సిన హక్కులను కల్పిచడంతో పాటు ఎక్స్‌గ్రేషియాను మంజూరుచేస్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. ఇది వరకు సాయమందడంలో ఉన్న జాడ్యాన్ని, జాప్యాన్ని నివారించి ఎప్పటికప్పుడు బాధితులకు పరిహారాన్ని అందజేస్తున్నారు. ఈ పది మాసాల కాలంలోనే జిల్లాలో 265 మందికి ఒక్కోక్కరికి రూ. లక్ష చొప్పున సాయంగా అందజేశారు. పూర్తి వివరాల్లోకి వెలితే.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం బాధితులను ప్రభుత్వమే ఆదుకోవాలి. జీవో నెం 25 ప్రకారం విడతలుగా పరిహారాన్ని అందజేయాలి. బాధిత కుటుంబాలకు అండగా నిలిచి, ఆయా కుటుంబాలకు భరోసా కల్పించాలి. ఘటన జరిగిన తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదుచేసి, తక్షణమే అట్రాసిటీ బాధితులకు ఎక్స్‌గ్రేషియా మంజూరు చేసేందుకు ప్రతిపాదనలు పంపించాలి. కానీ గత కొంత కాలంగా జిల్లాలో పలు కారణాలతో పరిహారం అందకపోవడంతో బాధితులు అవస్థలు పడుతున్నారు. న్యాయంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన సాయం అందకపోవడం ఇబ్బందులు పడుతున్నారు. 2014 నుంచి 18 వరకు మొత్తం 53 కేసులకు గాను ఎక్స్‌గ్రేషియాను మంజూరుచేయగా, కేవలం 2018 ఏప్రిల్ నుంచి 2019 జూన్ వరకు 265 మంది బాధితులకు ఎక్స్‌గ్రేషియాను మంజూరుచేశారు.

ఆధారాలు లేక జాప్యం..
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం నమోదవుతున్న కేసుల్లో పరిహరం అందజేయాలంటే ఎఫ్‌ఐఆర్, సరైన ఆధారాలు, వాంగ్మూలం తప్పనిసరి. కానీ ఆధారాలు ఎఫ్‌ఐఆర్ కాపీలు అందుబాటులో లేకపోవడంతో పరిహారం మంజూరైనా బాధితులకు అందడం లేదు. మొత్తంగా జిల్లాలో ఇప్పటి వరకు 693 కేసులు నమెదు కాగా, వాటిలో 265 కేసుల్లో సరైన ఆధారాలు లేక పెండింగ్‌లో ఉండటం గమనార్హం. ఆధారాలు లేకపోవడంతో ఆయా కేసులన్నీ పెండింగ్‌లోనే ఉంటున్నాయి. అంతే కాకుండా ఆయా కేసుల్లో ఏసీపీలు చార్జీషీట్లను దాఖలు చేసే క్రమంలోనూ జాప్యం జరుగుతున్నది. ఇలా కూడా కొన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఉత్పన్నమవుతున్న సమస్యలు పరిష్కారమయితే మిగతా బాధితులకు సైతం న్యాయం జరిగే అవకాశాలున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...