విద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట..


Mon,July 8, 2019 12:06 AM

కాచిగూడ,జూలై 7: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కోసం విద్యా రంగానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని, నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ డిప్యూటి చైర్మన్, ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ అన్నారు. కాచిగూడ మున్నూరుకాపు విద్యార్థి వసతి గృహం ట్రస్ట్‌బోర్డు ఆధ్వర్యంలో పదోతరగతిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు కాచిగూడలోని మున్నూరు కాపు సంఘంలో ఆదివారం మెరిట్ అవార్డ్స్-2019 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రస్ట్‌బోర్డు చైర్మన్ ప్రొఫెసర్ ఎంఆర్ వెంకట్‌రావు అధ్యక్షత మహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ హాజరై విద్యార్థులకు మెరిట్ అవార్డ్స్‌ను ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రూ.25 కోట్లతో తెలంగాణలోని యాదాద్రిలో నిర్మించిన మున్నూరుకాపు అన్నదాన సత్రాన్ని వచ్చే నెలలో సీఎం కేసీఆర్ చేత ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో 20 శాతం జనాభా కలిగిన మున్నూరుకాపులు ఐక్యంగా ఉంటూ రాజకీయంగా, ఆర్ధికంగా మరింతగా ఎదగాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ట్రస్ట్‌బోర్డు సభ్యుడు గంప చంద్రమోహన్ మాట్లాడుతూ తల్లిదండ్రులు లేని విద్యార్థులకు ట్రస్ట్‌బోర్డు ఆర్థికంగా ఆదుకుంటూ, ఉన్నత చదువులు చదవడానికి వెళ్ల్లే పేద విద్యార్థులకు ఆర్థిక సాయాన్ని ప్రభుత్వ పరంగా అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆకుల పాండురంగారావు, పన్నాల విష్ణువర్ధన్, జెల్లిసిద్ధ్దయ్య, కల్వకుంట్ల శ్రీనివాస్, బోయిన్‌పల్లి రమణాకర్, ప్యాటా రవీందర్, కొత్తపల్లి శ్రీకాంత్, హజరే రామ్మోహన్, కేసరి వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...