వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు


Mon,July 8, 2019 12:05 AM

నమస్తే తెలంగాణ-సిటీబ్యూరో: వర్షాకాలం ప్రారంభంతో ఫ్యాక్టరేబుల్ డిసీ జెస్ (దోమకాటుతో వచ్చే వ్యాధులు), వాటర్ బాండరెబుల్ డిసీజెస్(నీటివల్ల వచ్చే వ్యాధులు) వ్యాప్తి చెందే అవకాశాలు ఉండడంతో తెలంగాణ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ అప్రమత్తమైంది. ఈ క్రమంలో రాష్ట్రంతో పాటు గ్రేటర్‌లో వీవీపీ పరిధిలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రతి జిల్లా, ఏరియా హాస్పిటల్‌లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయనుంది. సంబంధిత ఆరోగ్య కేంద్రం పడకల సామర్ధ్యం ఆధా రంగా ప్రత్యేక వార్డుల్లో పడకలను కేటాయించనున్నట్లు అధికారులు తెలి పారు. ముఖ్యంగా ఫ్యాక్టర్ బాండరెబుల్ (దోమ కాటు వల్ల వచ్చే వ్యాధులు) పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు రాష్ట్ర వైద్య విధాన పరిషత్ సీనియర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డా.ఎస్.అశోక్ కుమార్ తెలిపారు.
ఫ్యాక్టర్ బాండరెబుల్ డిసీజెస్(దోమ కాటుతో వచ్చే వ్యాధులు):
క్యూలెక్స్ దోమకాటుతో మలేరియా, ఎడిసన్ అనే ఆడదోమ కాటుతో డెంగ్యు, చికన్ గున్యా, మెదడు వాపు, బోదకాలు సంక్రమిస్తాయి.
వాటర్ బాండరెబుల్ డిసీజెస్(నీటి ద్వారా వచ్చే వ్యాధులు):
డయేరియా, జాండీస్, టైఫైడ్, కలరా, హెపటైటిస్ వ్యాధులు సంక్రమిస్తాయి.
ప్రతి ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక వార్డు:
రాష్ట్రవ్యాప్తంగా వైద్యవిధాన పరిషత్ పరిధిలో మొత్తం 110 దవాఖానలు ప్రాంతాల వారిగా రోగులకు వైద్యసేవలు అందిస్తున్నాయి. ప్రస్తుతం వర్షా కాలం నేపథ్యంలో రాష్ట్రంతో పాటు గ్రేటర్ పరిధిలో మొత్తం 14ఏరియా, 3జిల్లా దవాఖానల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేస్తున్నట్లు సీనియర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డా.ఎస్.అశోక్‌కుమార్ తెలిపారు. ప్రత్యేక వార్డులతో పాటు అన్ని ఆరోగ్య కేంద్రాల్లో వ్యాధులను నిర్ధారించేందుకు అవసరమైన అన్ని రకాల రక్తపరీక్షల సౌలభ్యాన్ని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. మం దుల కొరత ఏర్పడకుండా ఉండేందుకు బఫర్ స్టాక్(సీజనల్ కాలం ముగి సేవరకు అదనపు స్టాక్) మందులను అందుబాటులో ఉంచనున్నట్లు డా. అశోక్ వివరించారు. గత సంవత్సరం కంటే ఈసారి 10శాతం అధికంగా మందులను అదనంగా అందుబాటులో ఉంచనున్నట్లు ఆయన తెలిపారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...