రేడియేషన్.. ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది


Mon,July 8, 2019 12:04 AM

యూసుఫ్‌గూడ : జీవన విధానంలో మోడలైజషన్ పెరిగి, పనిభారం, సాంకేతికంగా పెరిగిన రేడియేషన్ టెక్నాలజీ వల్ల ప్రధానంగా యుక్త వయస్సు మహిళల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని సైబరాబాద్ కమిషనర్ వీసీ.సజ్జనార్ అన్నారు. యూసుఫ్‌గూడ నిమ్స్‌మే మీటింగ్ హాల్‌లో సంతానలేమి సమస్యపై ఫెమి కేర్ దవాఖాన అధ్వర్యంలో జరిగిన శిక్షణ శిబిరం ఆదివారం ముగిసింది. ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ జీవితంలో చదువుతో పాటు లక్ష్యాన్ని సాధించడం ఎంత ముఖ్యమో పిల్లలు కనడం కూడా జీవితంలో భాగమేనన్నారు. ఈ సందర్బంగా ఫెమికేర్ వైద్యురాలు ఫమిదాబాను మాట్లాడుతూ సంతానం కలగపోవడంపై అడ్డుంకులను తొలగించేలా, వివిధ పక్రియల ద్వారా సంతానం కలిగే విధానంపై మహిళలల్లో అవగాహన కల్పించామన్నారు. సంతానలేమితో బాధపడుతున్న వారికి ఆధునిక చికిత్సా విధానంలో వచ్చిన మార్పులపై చర్చించామన్నారు. ఈ కార్యక్రమంలో ఫెమికేర్ సిబ్బంది, పలువురు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...