100 కిలోల గంజాయి పట్టివేత


Thu,June 20, 2019 12:24 AM

మాదాపూర్ : జల్సాలకు అలవాటుపడి.. గంజాయిని రవాణా చేస్తూ ఒకరు పోలీసులకు పట్టుబడ్డాడు. అతని నుంచి 100 కిలోలు గల 50 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. చందానగర్ ఇన్‌స్పెక్టర్ రవీందర్ కథనం ప్రకారం.... సంగారెడ్డి జిల్లా, చో ట్కూర్‌కు చెందిన వొన్నపురం రాజేందర్ (35) రామచంద్రాపురంలోని ఓల్డ్ ఎంఐజీలో నివాసం ఉంటున్నాడు. జల్లాలకు అలవాటు పడి... గంజాయి దందా చేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం జూమ్ కంపెనీలో మారుతి బ్రీజా ( టీఎస్07 యు హెచ్ 4738) ను మియాపూర్‌లో బుక్ చేసుకున్నాడు. నల్లగండ్లలోని ఓల్డ్ ఎంఐజీ సాయిబాబా గుడి ఎదురు గా రైల్వే ట్రాక్ సమీపం మార్గంలో గంజాయిని తీసుకొని వస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతని కారును తనిఖీ చేశారు. అందులో 100 కిలోలు గల 50 గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. దీని విలువ రూ.7 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. గంజాయి ప్యాకెట్లను ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్నట్లు చెప్పాడు. గతంలో రెండుసార్లు గంజాయిని తరలించానని చెప్పాడు. ఇందులో మరో ఇద్దరు ప్రదీప్, చెన్నయ్యలు పరారీలో ఉన్నారని తెలిపారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...