ప్లాస్టిక్‌ రహిత నగరంగా మార్చుదాం..


Wed,June 19, 2019 01:01 AM

పేట్‌బషీరాబాద్‌/ కేపీహెచ్‌బీ కాలనీ : ప్లాస్టిక్‌ రహిత నగరంగా మార్చుదామని గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ దానకిశోర్‌ అన్నారు. గాజులరామారం సర్కిల్‌లో ఆయన మంగళవారం పర్యటించారు. సాఫ్‌ హైదరాబాద్‌ - షాన్‌దార్‌ హైదరాబాద్‌ అమలును ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. చింతల్‌ డివిజన్‌ పరిధిలోని రంగానగర్‌లో మొదటగా పర్యటించిన ఆయన స్థానికంగా తడి, పొడి చెత్తతో తయారు చేస్తున్న వర్మికం పోస్టు ఎలా ఉపయోగిస్తున్నారో పరిశీలించారు. నగరంలో భూగర్భ డ్రైనేజీ డస్ట్‌బిన్‌లను ఏర్పాటు చేసేందుకు తగు స్థలాలను గుర్తించాలన్నారు. సాఫ్‌ హైదరాబాద్‌- షాన్‌దార్‌ హైదరాబాద్‌ లొకేషన్‌లలో నిర్థ్ధారించిన 2500 ఇండ్లలో జూలై వరకు తడి, పొడి చెత్తను వేర్వేరేగా చేయడం, స్వచ్ఛ ఆటోల్లో వేయడం పూర్తి చేయాలన్నారు. ఇప్పటి వరకు గ్రేటర్‌ పరిధిలో 300 టన్నులకు పైగా ప్లాస్టిక్‌ను సేకరించామన్నారు. ప్రతి ఇంట్లో ప్లాస్టిక్‌ కవర్లకు బదులుగా జ్యూట్‌ బ్యాగులను ఉపయోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జోనల్‌ కమిషనర్‌ శంకరయ్య, ఉప కమిషనర్‌ రవీంద్ర కుమార్‌, ఈఈ మహేశ్వర్‌రెడ్డి, వైద్యాధికారి మహిపాల్‌రెడ్డి, డీఈలు శిరీష, లాల్‌సింగ్‌, జలమండలి అధికారులు అప్పలనాయుడు, భాస్కర్‌, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలి
కాలనీలు, బస్తీలలో స్వచ్ఛ పరిసరాల కోసం చేస్తున్న అవగాహన కార్యక్రమాల్లో రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగులు, సీనియర్‌ సిటిజన్స్‌, స్వచ్ఛంద సంస్థల సేవలను వినియోగించుకోవాలని కమిషనర్‌ దాన కిశోర్‌ అన్నారు. మంగళవారం ‘సాఫ్‌ హైదరాబాద్‌... షాన్‌దార్‌ హైదరాబాద్‌'లో భాగంగా కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి జోన్ల జెడ్సీలు జె.శంకరయ్య, హరిచందన సమక్షంలో డీసీలు, ఏఎంహెచ్‌వోలు, ఎన్విరాల్‌మెంట్‌ ఇంజినీర్లు, లొకేషన్‌ ఇన్‌చార్జిలు, స్వచ్ఛ సీఆర్పీలు, ఎన్‌జీవోలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. సాఫ్‌ హైదరాబాద్‌... షాన్‌దార్‌ హైదరాబాద్‌లో పేర్కొన్న 19 అంశాలను సాధించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. నిషేధిత ప్లాస్టిక్‌ కవర్లను వాడకుండా చూడాలని, జూట్‌ బ్యాగులను వినియోగించేలా అవగాహన కలిపించాలని కోరారు. నిబంధనలు పాటించని వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు.

సర్కిల్‌కు 50 మంది చొప్పున..
సాఫ్‌ హైదరాబాద్‌... షాన్‌దార్‌ హైదరాబాద్‌లో భాగం గా ప్రతి సర్కిల్‌కు 50 మంది చొప్పున రిటైర్డ్‌ ఉద్యోగులను గుర్తించి స్వచ్ఛ పరిసరాల కోసం చేస్తున్న అవగాహన కార్యక్రమాలను భాగస్తులను చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మూసాపేట, కూకట్‌పల్లి, గాజులరామారం, అల్వాల్‌, కుత్బుల్లాపూర్‌, చందానగర్‌, శేరిలింగంపల్లి, యూసఫ్‌గూడ, పటాన్‌చెరు సర్కిళ్ల డీసీలు, ఏఎంహెచ్‌వోలు, ఎన్విరాల్‌మెంట్‌ ఇంజినీర్లు, స్వచ్ఛ వలంటరీలు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...