మాజీ ఎంపీ వీహెచ్‌ అరెస్ట్‌


Wed,June 19, 2019 12:59 AM

ఖైరతాబాద్‌/బేగంబజార్‌: అనుమతి లేకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు యత్నించడంతో ఓ విగ్రహాన్ని తొలగించే యత్నంలో అడ్డుకున్న పోలీసులను దూషించిన కేసులో కాంగ్రెస్‌ నేత వి. హన్మంతరావు, అతని అను చరులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మంగళవారం ఉదయం 5.20గంటలకు మాజీ ఎంపీ హన్మంతరావు 20 మంది కార్యకర్తలతో కలిసి హైదరాబాద్‌ సెంట్రల్‌ మాల్‌ వద్ద చేరుకున్నారు. అక్కడ తన వెంట తెచ్చుకున్న ఓ విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు యత్నించారు. అంతేకాకుండా అక్కడే ఉన్న వైఎస్‌ఆర్‌ విగ్రహాన్ని సైతం తొలగించేందుకు విఫలయత్నం చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పంజా గుట్ట పోలీసులు వారిని అడ్డుకునేందుకు యత్నించగా, హన్మంతరావు పోలీ సులను పరుశపదజాలంతో దూషించారు. దీంతో కొద్ది సేపు ఘర్షణ వాతా వరణం నెలకొంది. పోలీసులు ఎంత చెప్పినా వినకుండా విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టించేందుకు యత్నించడంతో పాటు వైఎస్‌ఆర్‌ విగ్రహాన్ని తొలగించేం దుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అడ్డుకొని అతన్ని అరెస్టు చేశారు. అనంతరం అతన్ని బొల్లారం పోలీసు స్టేషన్‌కు తరలించారు. అతను వెంట తెచ్చుకున్న విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు యత్నించిన మాజీ ఎంపీలపై పోలీసులు నాలుగు కేసులను నమోదు చేశారు.ఈ మేరకు వారిని నాంపల్లి కోర్టు లో హాజరుపరిచేందుకు గాను వైద్య పరీక్షల నిమి త్తం ఉస్మానియా దవాఖానాకు తరలించారు. దవాఖానాలో మాజీ ఎంపీలు వీహెచ్‌ హన్మంతరావు, హర్షకుమార్‌లకు వైద్యులు బీపీ,షుగర్‌ పరీక్షలు నిర్వహించగా హన్మంతరావుకు 400 షుగర్‌ ఉన్నట్లు గుర్తించి అబ్జర్వేషన్‌లో ఉంచారు. కాగా మిగిలిన ఎనిమిది మందిని పోలీసులు వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచేందుకు దవాఖానా నుంచి తరలించారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...