తిరుమల రామచంద్ర జయంతి


Tue,June 18, 2019 04:04 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/త్యాగరాయగానసభ: రచయితగా, బహుభాషా కోవిధుడుగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా తిరుమల రామచంద్ర సాహితీ సంద్రంలో సుపరిచితులని తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షులు దేవులపల్లి ప్రభాకర రావు అన్నారు. త్యాగరాయ గానసభలోని కళా లలిత కళా వేదికలో గానసభ ఆధ్వర్యాన ప్రముఖ సాహితీవేత్త తిరుమల రామచంద్ర జయంతి కార్యక్రమం గానసభ అధ్యక్షులు కళా వీఎస్‌ జనార్దన మూర్తి అధ్యక్షతన సోమవారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా రామచంద్ర చిత్ర పటానికి అతిథులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇందులో భాగంగా దేవులపల్లి ప్రభాకర్‌ రావు మాట్లాడుతూ, మాతృభాషయైన తెలుగుతో పాటు కన్నడ, తమిళం, సంస్కృతం, ఇతర భాషల్లో ప్రావీ ణ్యం సంపాదించిన గొప్ప బహు భాషావేత్త ‘రామచంద్ర’ అని అన్నారు. రకరకాల వృత్తులు చేసి, పలు రకాలుగా అనుభవాలు సంపాదించి విస్తృత లోకానుభవ శాలి అని అనిపించుకున్నారన్నారు.

రామచంద్ర తనను తాను వినమ్రంగా ‘భాషా సేవకుడు’ అని అభివర్ణించుకునే వారన్నారు. వివిధ పత్రికలలో పలు హోదాలలో పని చేశారని, ‘భారతి’ మాస పత్రిక ఇన్‌చార్జి సంపాదకులుగా పని చేశారన్నారు. తిరుమల రామచంద్ర 84 యేళ్ల జీవితంలో అర్థ శతాబ్దం వరకు పత్రికా రచనలకే అంకితమైనారని అన్నారు. తెలుగు నాట, భారతావనిలో ప్రసిద్ధులైన కవి పండితులు, కళాకారులు, భాషా వేత్తలు, తత్వ చింతకులు అయిన ప్రతిభా శీలురు అనేక మందిని ఇంటర్వ్యూలు చేశారని, ఆయన రాసిన 50 పుస్తకాలకు పైగా ప్రచురిత మయ్యాయన్నారు. పత్రికా శిరోమణి, కళా సరస్వతి, మహో మహోపాధ్యాయ వంటి బిరుదులను అందు కున్న గొప్ప వ్యక్తి తిరుమల రామచంద్ర అని అన్నారు. కార్యక్రమంలో విశిష్ట అతిథిగా తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు డాక్టర్‌ నాళేశ్వరం శంకరం, ఆత్మీయ అతిథిగా చైతన్య కళా సమితి అధ్యక్షులు భవనాశి శ్రీనివాస్‌, గానసభ ప్రధాన కార్యదర్శి కళా శారదా దీక్షితులు పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...