చర్లపల్లి పారిశ్రామికవాడ అభివృద్ధికి కృషి చేస్తా


Mon,June 17, 2019 03:40 AM

చర్లపల్లి: చర్లపల్లి పారిశ్రామికవాడ సమగ్రాభివృద్ధి కోసం తన వంతు కృషి చేయనున్నట్లు చర్లపల్లి పారిశ్రామికవాడ, ఐలా చైర్మన్ కట్టంగూర్ హరీశ్‌రెడ్డి పేర్కొన్నారు. పారిశ్రామికవాడలోని పారిశ్రామికవేత్తల భవనంలో నూత నంగా ఎన్నికైన ఐలా చైర్మన్ కట్టంగూర్ హరీశ్‌రెడ్డి, కమిటీ సభ్యులు ఎన్నికల అధికారి నజీర్ అహ్మద్, ఐలా కమిషనర్ విజయల ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామికవాడలో నెలకొన్న సమస్యలను దశలవారిగా పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటామని, సుమారు 6కోట్ల నిధులతో చేపట్టనున్న చిల్డ్ర న్స్ పార్కు పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటుల్లోకి తీసుకు వచ్చేం దుకు కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా పారి శ్రామికవాడలో ఖాళీ స్థలాలను పరిరక్షించేందుకు తమ వంతు కృషి చేయ నున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా పారిశ్రామికవాడలో దెబ్బతిన రోడ్లను గుర్తించి ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారుల నిర్మాణ పనులు చేపట్ట నున్నామని, ప్రభుత్వ పథకాలైన హరితహారం, ఇంకుడు గుంతల నిర్మాణ పనులను పారిశ్రామికవేత్తలు, కార్మికుల భాగస్వామ్యంతో ఉద్యమంలా చేపట్టి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమల యజమానులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమ స్యలను పరిష్కరించడంతో పాటు సౌకార్యలు కల్పించేందుకు కృషి చేస్తామని, ఐలా ఆధ్వర్యంలో పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టి ఇతర పారిశ్రా మికవాడలకు ఆదర్శంగా నిలువనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన చైర్మన్ కట్టంగూర్ హరీశ్‌రెడ్డి, కమిటీ సభ్యులను ఘనం గా సన్మానించారు. ఈ కార్య క్రమంలో తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐలా చైర్మన్ సుధీర్‌రెడ్డి, ఐలా కార్యదర్శి విశ్వేశ్వర్ రావు, వైస్ చైర్మన్ రోషిరెడ్డి, సంయుక్త కార్యదర్శి గోపాల్‌క్రిష్ణ, కోశాధికారి వెంకటేశ్వర్‌రెడ్డి, కమిటీ సభ్యులుగా సునిల్ జింతుల్కార్, ప్రవీణ్‌కుమార్, వెంకటరత్నం, గంగాధర్ రావు, వీవీబీ.సత్యనారాయణ, శివాజీ, మురళీధర్ బాబు, మల్లిఖార్జున్‌రెడ్డి, రాంచందర్‌రావు, సుధాకర్‌రెడ్డి, శంకర్‌రావు, సుధాకర్, బాబర్‌అలీ, ఎంవీ ఎస్.మూర్తి, జగపతిరాజు, సంపత్‌రావు, పారిశ్రామిక వేత్తలు గోపాల్‌రావు, అప్పిరెడ్డి, తాటి శ్రీనివాస్, జగపతిరాజులతో పాటు వందాలది మంది పారి శ్రామికవేత్తలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...