సాధూరాం ఆసుపత్రి సేవలు మరువలేనివి


Mon,June 17, 2019 03:40 AM

కవాడిగూడ: లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సాధూరాం కంటి ఆసుపత్రి 45 వార్షికోత్సవాలు దోమలగూడలోని ఆసుపత్రిలో జరిగాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అన్న లక్ష్యంతో సాధూరాం ఆసుప్రతి పనిచేస్తుంద న్నారు. 1996 నుంచి సంస్థతో తనకు అనుబంధం ఉందన్నారు. తన సొంత ఊరిలో సాధూరాం ఆసుపత్రి యాజమాన్యం మోగా మెడికల్ క్యాంప్ నిర్వ హించిందని గుర్తు చేశారు. సాధూరాం ఆసుపత్రి ఒక విజన్‌తో ఒక మిషన్‌గా సేవలను అందిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కంటి శిబిరాలను నిర్వహిం స్తుందని, చూపులేని వారికోసం ఆపరేషన్లు చేసేందుకు ఆసుపత్రి చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. వ్యాపార దృక్పథంతో కాకుండా సేవే ధ్యే యంగా దక్షిణాధిలోనే విజయవంతంగా సాధూరాం ఆసుపత్రి నడుస్తోం దన్నారు. ఆసుపత్రికి స్థలం కేటాయింపు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడతానని, అవసరమైతే లేఖ రాస్తానని చెప్పారు. కేంద్రం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తామన్నారు. ప్రైవేటు ఆసుపత్రులు సేవాభావంతో పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పభుత్వ (హోమ్) సెక్రెటరీ రాజీవ్ త్రివేదీ, డాక్టర్ ఎ.వెంకటాచలం, లయన్స్ క్లబ్ ఆఫ్ హైద రాబాద్ అధ్యక్షులు సురేష్ కుమార్ అగర్వాల్, సెక్రెటరీ జగదీశ్‌సంద సాని, కెఎస్‌ఎటి చైర్మన్ గురుచరణ్ భవ్‌నాని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
హిమాయత్‌నగర్ బస్తీల్లో పర్యటన
హిమాయత్‌నగర్: కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాద నిర్మూలన కోసం తగిన చర్యలు తీసుకుంటుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎంపీగా గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ఆదివారం హిమాయత్‌నగర్ డివిజన్‌లోని రామారావు బస్తీ,శంషీర్‌బాగ్,విఠల్‌వాడీ తదితర ప్రాంతాల్లో పాదయాత్ర చేసి, ప్రజలు ఎదుర్కొ ంటున్న సమస్యలను తెలుసు కున్నారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్,మహాత్మాగాంధీల ఆలోచన విధానంతో ముందుకు సాగి దేశ ప్రగతి కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుం దన్నారు. ప్రతి శని,ఆదివారాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమ స్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. నారాయణ గూడలో ఉన్న బీజేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లోపలి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నామని, దారి కల్పించాలని కోరుతూ కళాశాల బృందం మంత్రి కిషన్‌రెడ్డికి విన్నవించారు. మంత్రి సాను కూలంగా స్పందించి వీలైనంత త్వరగా ఈ సమ స్య పరిష్కారం అయ్యేందుకు చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చా రు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామ చంద్రారెడ్డి,బీజేపీ నాయకులు కేశబోయిన శ్రీధర్, నవీన్, మల్లేశం,దేవేందర్, శ్రీహరి, లక్ష్మణ్, కె.కవిత, విజయతులసీ,బింధ్యా, జైస్వాల్,మాధవి పాల్గొన్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...