ఆభరణాలకు కేరాఫ్‌ హైదరాబాద్‌


Sat,June 15, 2019 12:39 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: దక్షిణ భారతంలో ఆభరణాల కేంద్రంగా హైదరాబాద్‌ విరాజిల్లుతోందని డిప్యూటీ స్పీకర్‌ టి.పద్మారావు గౌడ్‌ అన్నారు. భారతదేశ ప్రీమియం బీ2బీ జ్యుయలరీ ట్రేడ్‌ షో అయిన హైదరాబాద్‌ జ్యుయలరీ, పర్ల్‌ అండ్‌ జెమ్‌ ఫెయిర్‌ (హెచ్‌జేఎఫ్‌ 2018) తన 12వ ఎడిషన్‌ను హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (హెచ్‌ఐసీసీ), నోవాటెల్‌లో శుక్రవారం ప్రారంభించింది. ప్రదర్శన శుక్రవారం నుంచి ఆది వారం వరకు కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ స్పీకర్‌ టి.పద్మారావు హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్‌ మహా నగరం ఒక మినీ ఇండియా అని, హైదరాబాద్‌ సంస్కృతి ఎంతో ఉన్నతమైనదని, దక్షణ భారతంలో ప్రత్యేక ఆభరణాలకు కేంద్రంగా హైదరాబాద్‌కు పెట్టింది పేరన్నారు.

దేశంలోనే కాకుండా విదేశాల నుంచి సైతం హైదరాబాద్‌ కేంద్రానికి ఆభరణాల వర్తకులు వస్తున్నారని అన్నారు. వారి వర్తకం హైదరాబాద్‌ కేంద్రంగా జరుగుతోందన్నారు. వివిధ రాష్ర్టాలు, దేశాల నుంచి వచ్చిన ప్రతి వ్యాపారికి తెలంగాణ ప్రభుత్వం, ప్రజలు మద్దతుగా ఉంటారని అన్నారు. మా ఇంటి వద్దే కుండలు, బంగారు ఆభరణాలకు సంబంధించిన ఎన్నో వ్యాపార మార్కెట్లు ఉన్నాయని వారికి సంబంధించిన ఇబ్బందులు అన్నీ తనకు తెలుసని అన్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే సీఎం కేసీఆర్‌తో సంప్రదించి పరిష్క రిస్తా నని హామీ ఇచ్చారు. హైటెక్‌ సిటీ జ్యుయలర్స్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ మహేంద్ర తాయల్‌, హైటెక్‌ సిటీ జ్యుయలర్స్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ కన్వీనర్‌ ముఖేష్‌ అగర్వాల్‌, ఇండోనేషియన్‌ ట్రేడ్‌ ప్రమోషన్‌ సెంటర్‌ డైరెక్టర్‌ కుమార జాటి, ఇండోనేషియన్‌ ట్రేడ్‌ ప్రమోషన్‌ సెంటర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ అంగేలియా పార్డెడె, యూబీఎం ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ యోగేష్‌ మద్రాస్‌, యూబీఎం గ్రూప్‌ డైరెక్టర్‌ అభిజిత్‌ ముఖర్జీ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

జిల్లాల అసోసియేషన్ల సహకారంతో ప్రదర్శన
దేశ అగ్రగామి ఎగ్జిబిషన్‌ ఆర్గనైజర్‌చే నిర్వహించబడుతున్న హైదరాబాద్‌ జ్యుయలరీ, పర్ల్‌ అండ్‌ జెమ్‌ ఫెయిర్‌ అనేది హైటెక్‌ సిటీ జ్యుయలర్స్‌ మాన్యుఫాక్షరర్స్‌ అసోసియేషన్‌, తెలంగాణ బులియన్‌ జెమ్స్‌ అండ్‌ జ్యుయలరీ ఫెడరేషన్స్‌తో పాటుగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన 200లకు పైగా జిల్లా అసోసియేషన్ల సహకారంతో ఈ ప్రదర్శన జరుగుతోంది.

450 కి పైగా అగ్రగామి బ్రాండ్ల ప్రదర్శన
దేశ విదేశాలకు చెందిన 450కి పైగా అగ్రగామి బ్రాండ్లు తమ అత్యుత్తమ జ్యుయలరీ, హస్తకళా నైపుణ్య భరిత కలెక్షన్‌ను హెచ్‌జేఎఫ్‌ 2019లో సందర్శల కోసం ప్రదర్శనకు పెట్టాయి. ప్రముఖ జ్యుయలరీ బ్రాండ్లు, ఫైన్‌ ఫినిష్‌డ్‌ జ్యుయలరీ మాన్యుఫాక్షరర్స్‌, హోల్‌ సేలర్స్‌, రిటైలర్లు, దిగుమతిదారులు, ఎగుమతిదారులు, ప్రిసియస్‌ మెటల్‌ అండ్‌ జ్యుయ లరీ మౌంటింగ్‌ వర్తకులు, ప్యాకేజింగ్‌ అండ్‌ డిస్‌ప్లే, హాల్‌ మార్కర్స్‌, ఇంకా వర్తక సంఘా లు, ప్రభుత్వ విభాగాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఈ ప్రదర్శన కీలకాంశాల్లో ప్రధానమైనది.. ఇండోనేషియాకు చెందిన నాలుగు ప్రముఖ బ్రాండ్లు మొట్ట మొదటిసారిగా ఇందులో పాల్గొనడం. నహ్దీ జ్యుయలరీ, మిరా, ఎలిహాన్‌ జ్యుయలరీ, ఇండా ముటియారా లాంబాక్‌ వంటివి ప్రదర్శనలో ఉన్నాయి.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...