పర్యవేక్షణ కొనసాగించాలి..


Sat,June 15, 2019 12:36 AM

చార్మినార్‌/సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : పాతనగరంగా ప్రసిద్ధిగాంచిన చార్మినార్‌ జోన్‌లో నెలకొన్ని వివిధ సమస్యల పరిష్కారానికి జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు ప్రారంభించింది. హైదరాబాద్‌ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్‌ ఒవైసీ విజ్ఞప్తి మేరకు అధికారులు చర్యలకు దిగారు.
అసదుద్దీన్‌ ఒవైసీతోపాటు ప్రభుత్వ మున్సిపల్‌ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిశోర్‌ శుక్రవారం చార్మినార్‌ జోన్‌లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ స్థానికంగా ఉన్న వివిధ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై వెంటనే అరవింద్‌ కుమార్‌ స్పందించి ఎంపీ చెప్పిన సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాతనగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగించాల న్నారు. ఈ కార్యక్రమంలో చార్మినార్‌ ఎమ్మెల్యే ముం తాజ్‌ అహ్మమద్‌ఖాన్‌తో పాటు జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పర్యటన సందర్భంగా గుర్తించిన సమస్యలు
-మోతీగల్లీ నుంచి వచ్చే ట్రాఫిక్‌ సులభంగా వెళ్లేలా లాడ్‌ బజార్‌ నుంచి ముర్గీచౌక్‌ వరకు రోడ్డు విస్తరణ, అడ్డుగా ఉన్న ఆస్తుల సేకరణ
-శాలిబండలో పిస్తాహౌస్‌ వద్ద ట్రాఫిక్‌కు అడ్డంకిగా మారిన ఓ శిథిల భవనాన్ని కూల్చివేయడం
-బహుళ అంతస్తుల పార్కింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి ప్రతిపాదిత పాత చార్మినార్‌ బస్టాండు స్థలంలో కొంతభాగాన్ని రోడ్డు విస్తరణతోపాటు బస్‌బే కోసం వినియోగం
-సాధ్యమైనంత తొందరలో ముర్గీచౌక్‌ పునర్నిర్మాణం
-చార్మినార్‌ పాదచారుల ప్రాజక్టులో భాగంగా లాడ్‌ బజార్‌ మార్గంలో ఏర్పాటుచేసిన రాళ్లు(ఫ్లోరింగ్‌)పాదచారులకు ఇబ్బందికరంగా ఉండడమే కాకుండా వర్షం వచ్చినప్పుడు నీరు నిలుస్తున్నందున ఫ్లోరింగ్‌ను నునుపుగా ఉండేలా తీర్చిదిద్దడం, లేక రాళ్లను తొలగించి మళ్లీ ఫ్లోరింగ్‌ ఏర్పాటుచేయడం
-రాఘవేంద్ర కాలనీలోని బుమ్క్‌ దౌలా చెరువు చుట్టూ వాకింగ్‌ ట్రాక్‌ నిర్మాణం

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...