పండుగలు మతసామరస్యాన్ని పెంపొందిస్తాయి


Sat,June 15, 2019 12:36 AM

చాదర్‌ఘాట్‌ : పండుగలు మతసామరస్యంతో పాటు సోదరభావాన్ని పెంపొందిస్తాయని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రీజినల్‌ డీజీఎం వినోద్‌ కుమార్‌ ఉపాధ్యాయ్‌ అన్నారు. శుక్రవారం చంచల్‌గూడలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(బీఓబీ) లో ఈద్‌-మిలాప్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీజీఎం వినోద్‌కుమార్‌ ఉపాధ్యాయ్‌తో పాటు మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్‌ బిన్‌ అబ్దుల్లా బలాల, బ్యాంక్‌ జోనల్‌ డీజీఎం జి.సత్యనారాయణ, సామాజిక సేవకురాలు జానకి రాజ్‌గోపాల్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయడం ఎంతో ఉత్తమమైనది పేర్కొన్నారు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు దేశవ్యాప్తంగా 38వేలు పై చిలుకు బ్రాంచీలు ఉన్నాయన్నారు. ఖాతాదారులకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తున్నదని తెలిపారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఎన్‌టీఆర్‌ హెల్త్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అదే విధంగా మ్యాక్స్‌ బూపా ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్త్‌ క్యాంప్‌లో దాదాపు 50 మంది వరకు ఉచిత హెల్త్‌ చెకప్‌ చేయించుకున్నారు. కార్యక్రమంలో అంబేద్కర్‌ యూనివర్సిటీ వీసీ రాజ్‌పత్‌ రాయ్‌, సైనీ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు అజహర్‌ మక్సూసీ, బ్యాంకు అధికారి డాక్టర్‌ ముక్తార్‌ అహ్మద్‌ ఫర్దీన్‌, ముజ్తబాఆబేదీ, విద్యావేత్త మహ్మద్‌ యూసుఫ్‌, ఎంఐఎం నాయకుడు అబ్రార్‌ పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...