పైవంతెనల కోసం రూ. 305 కోట్లు


Fri,June 14, 2019 12:58 AM

-ఎస్‌ఆర్‌డీపీ పనులకు బాండ్ల ద్వారా నిధుల సమీకరణ
-చెరువుల్లో వ్యర్థాల తొలగింపునకు ఆధునిక యంత్రాలు
-బల్దియా స్థాయీసంఘం ఏకగ్రీవ తీర్మానం
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఉప్పల్‌లో నూతన ైఫ్లెఓవర్‌తో పాటు స్కైవాక్ నిర్మాణం, అలాగే హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్ వద్ద ఆర్‌యూబీ నిర్మాణం కోసం భూసేకరణకు బల్దియా స్థాయీసంఘం అనుమతించింది. అలాగే, చెరువుల్లో వ్యర్థాల తొలగింపునకు ఆరు అత్యాధునిక యంత్రాల సేకరణ ప్రతిపాదనకు కూడా సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ మేరకు మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన గురువారం సమావేశమైన బల్దియా స్థాయీసంఘంలో పలు కీలక తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా మొత్తం 23 అంశాలను ఆమోదిస్తూ తీర్మానించారు. అందులో అవసరాలకు అనుగుణంగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల నియామకం, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల నియామకం, పలు రోడ్ల విస్తరణ తదితర మొత్తం 23 అంశాలున్నాయి.

ముఖ్యమైన తీర్మానాలు....
-ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి ఉప్పల్ స్టేడియం మీదుగా ఐటీ పార్కు వరకు ైఫ్లెఓవర్, స్కైవాక్ నిర్మాణానికి వీలుగా రోడ్డును 36మీటర్ల మేరకు విస్తరించేందుకు అడ్డుగా ఉన్న రెండు ఆస్తుల సేకరణ ప్రతిపాదనకు ఆమోదం.
-హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్ నుంచి 215 నంబరు బ్రిడ్జివరకు ఆర్‌యుబీ నిర్మాణానికి ఆరు ఆస్తుల సేకరించే ప్రతిపాదనకు ఆమోదం.
-రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన కరువు భత్యాన్ని జీహెచ్‌ఎంసీ ఉద్యోగులకు కూడా వర్తింపజేసే ప్రతిపాదనకు ఆమోదం.
-చెరువుల్లో తేలియాడే చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు రూ. 6.05 కోట్ల వ్యయంతో ఆరు బహుళ ప్రయోజనకర ఫ్లోటింగ్ ట్రాష్ కలెక్టర్లను సేకరించే ప్రతిపాదనకు ఆమోదం.
-నిర్మాణ వ్యర్థాలు, చెత్తను సేకరించేందుకు మినీ టిప్పర్లు, బాబ్‌కాట్‌లను అద్దె ప్రాతిపాదికన సేకరించే ప్రతిపాదనకు ఆమోదం.
-ఈనెలలో, లేక వచ్చే జూలై మాసంలో ఎస్‌ఆర్‌డీపీ పనుల నిధుల సేకరణకుగాను మూడో విడుత మున్సిపల్ బాండ్లు జారీచేయడం ద్వారా రూ. 305 కోట్లు సేకరించే ప్రతిపాదనకు ఆమోదం.
-దుర్గంచెరువుపై ఇంటిగ్రేటెడ్ లైటింగ్ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం.
- 2017-18 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ సవరణకు ఆమోదం.
-తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో, ఉత్తర, దక్షిణ పంపిణీ విభాగాలు చేసిన వేతన సవరణను జీహెచ్‌ఎంసీలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న విద్యుత్ ఇంజినీర్లకు కూడా వర్తింపజేస్తూ తీర్మానం.
-కొత్తగా ఏర్పాటు చేసిన కూకట్‌పల్లిజోన్‌లో అవసరాలకు ఔట్‌సోర్సింగ్‌పై 48 మంది కంప్యూటర్ ఆపరేటర్లను రూ. 17500నెల వేతనంపై నియామకానికి ఆమోదం.
-అర్బన్ బయోడైవర్శిటీ విభాగంలో ఔట్‌సోర్సింగ్‌పై పనిచేస్తున్న 39 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, 18మంది టెక్నికల్ అసిస్టెంట్లకు నెలకు రూ. 1000చొప్పున రవాణా భత్యం చెల్లింపునకు ఆమోదం.
-బల్కాపూర్ నాలాపై సీసీ రీటెయినింగ్ వాల్ నిర్మాణానికి రూ. 19కోట్లు మంజూరు చేస్తూ తీర్మానం.
-ముర్కినాలాపై రీమోడలింగ్ పనులకు రూ. 2.90 కోట్లు మంజూరు చేస్తూ తీర్మానం.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...